Last Updated:

Project Cheetah: ‘ప్రాజెక్ట్ చిరుత’ క్రెడిట్ మాదే.. కాంగ్రెస్

ప్రధాని నరేంద్రమోదీ నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో 'ప్రాజెక్ట్ చిరుత' ప్రతిపాదనను 2008-09లో అప్పటి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆమోదించిందని కాంగ్రెస్ పేర్కొంది.

Project Cheetah: ‘ప్రాజెక్ట్ చిరుత’ క్రెడిట్ మాదే.. కాంగ్రెస్

New Delhi: ప్రధాని నరేంద్రమోదీ నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ‘ప్రాజెక్ట్ చిరుత’ ప్రతిపాదనను 2008-09లో అప్పటి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆమోదించిందని కాంగ్రెస్ పేర్కొంది.

“ప్రాజెక్ట్ చిరుత’ ప్రతిపాదన 2008-09లో తయారు చేయబడింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. 2010 ఏప్రిల్‌లో అప్పటి అటవీ, పర్యావరణ మంత్రి జైరాం రమేష్‌ దక్షిణాఫ్రికాలోని చిరుత ఔట్‌రీచ్‌ సెంటర్‌కి వెళ్లారని జైరామ్ రమేష్ చిరుతను పట్టుకున్న చిత్రంతో కూడిన ట్వీట్‌లో పేర్కొంది. 2013లో చిరుత పునరుద్ధరణ కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు నిలిపివేసిందని, 2020లో అనుమతించిందని కాంగ్రెస్ తెలిపింది. ‘ప్రాజెక్ట్ చిరుత’కు మార్గం సుగమం చేసిందని కాంగ్రెస్ పేర్కొంది.

అంతకుముందు జైరామ్ రమేష్ కొన్ని వారాల క్రితం ఒక దినపత్రికలో చిరుతలపై వ్రాసిన ఒక కథనాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇది చిరుత భారతదేశానికి ఎలా వచ్చిందినే చరిత్రను అందించింది. కేప్ టౌన్‌లోని చిరుత ఔట్‌రీచ్ సెంటర్‌ను సందర్శించడం మరియు ఆ కార్యక్రమం క్రింద జరిగిన ప్రయత్నాల గురించి కూడా రమేష్ వివరించారు.

ఇవి కూడా చదవండి: