Last Updated:

National Investigation Agency: హైదరాబాద్, హనుమకొండలో ఎన్ఐఎ సోదాలు

జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఎ) హైదరాబాద్‌, హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని చైతన్య మహిళా సంఘం కన్వీనర్‌ జ్యోతి ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.

National Investigation Agency: హైదరాబాద్, హనుమకొండలో ఎన్ఐఎ సోదాలు

Hyderabad: జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఎ) హైదరాబాద్‌, హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని చైతన్య మహిళా సంఘం కన్వీనర్‌ జ్యోతి ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.

హనుమకొండలోని చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనితను ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనిత ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. జూన్‌లో రంగారెడ్డి, మెదక్‌, సికింద్రాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. హైకోర్టు న్యాయవాది చుక్కా శిల్ప, దేవేంద్ర, స్వప్నలను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి: