Huge flood flow: నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ లకు వరద ఉధృతి..
నాగార్జున సాగర్‌కు వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లు అన్నీ ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 4 లక్షల 14 వేల 14 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4 లక్షల 22 వేల 292 క్యూసెక్కులుగా ఉంది.
Hyderabad: నాగార్జున సాగర్‌కు వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లు అన్నీ ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 4 లక్షల 14 వేల 14 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4 లక్షల 22 వేల 292 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 305 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ముంపు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేవారు. ఇక జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1088 అడుగులుగా ఉంది. జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 254 టీఎంసీల నీరు వచ్చి చేరగా 195 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.37 క్యూసెక్కులుగా ఉంది. అంతకంతకు వరద నీరు పెగుగుతుండటంతో ప్రకాశం బ్యారేట్ ఏక్షణంలోనైన మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. కృష్ణనది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకూడదన్నారు.