Last Updated:

Ts Assembly: ఈటలతో కేటీఆర్ భేటీ.. భాజపా వర్గాల్లో హాట్‌టాపిక్

Ts Assembly: నేడు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తిరక సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత.. సభను వాయిదా వేశారు. కానీ గవర్నర్ ప్రసంగానికి ముందు.. ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

Ts Assembly: ఈటలతో కేటీఆర్ భేటీ.. భాజపా వర్గాల్లో హాట్‌టాపిక్

Ts Assembly: నేడు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తిరక సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత.. సభను వాయిదా వేశారు. కానీ గవర్నర్ ప్రసంగానికి ముందు.. ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ ప్రసంగానికి ముందు.. సభలో ఆసక్తిరక సన్నివేశం చోటు చేసుకుంది.
భాజపా ఎమ్మెల్యేలు.. ఈటల రాజేందర్, రఘునందనరావు, రాజసింగ్ వద్దకొచ్చి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటలతో.. ప్రత్యేకంగా కేటీఆర్ సంభాషించారు.

వీరి మధ్య సరదా సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. హుజురాబాద్‌ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఈటల ఎందుకు పాల్గొనలేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. దీనిపై ఈటల సరదాగా సమాధానం ఇచ్చారు. ఎవరైనా పిలిస్తే కదా హాజరైయ్యేదంటూ ఈటల సమాధానం ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ విధానాలు.. ప్రజల్లోకి వెళ్ళే ప్రాక్టీస్ సరిగాలేదని కేటీఆర్‌ కు ఈటల రాజేందర్ హితవు పలికారు.

మంత్రి కేటీఆర్- ఈటల మధ్య జరుగుతుండగా.. మధ్యలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్యలో ఎంట్రీ ఇచ్చారు. భట్టి మాట్లాడుతూ.. తనను కూడా అధికారిక కార్యక్రమాలకు ఎవరు పిలవడం లేదంటూ ప్రస్తావించారు. అధికారిక కార్యక్రమాలకు.. కలెక్టరేట్ అయినా ఆహ్వానించాలని ఈటల అనగా.. మంత్రి కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు.

 

ఇదే సమయంలో గవర్నర్ సభలోకి వస్తున్నారంటూ కేటీఆర్‌ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అప్రమత్తం చేశారు. దీంతో కేటీఆర్ తన ట్రెజరీ బెంచీల వైపు వెళ్ళిపోయారు. కేటీఆర్ కంటే ముందే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈటల వద్దకొచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈటల, కేటీఆర్‌ల సమావేశం ప్రస్తుతం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.

ఈటల రాజేందర్ తెరాసకు రాజీనామా చేసి భాజపా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

కేటీఆర్ Minister KTRతో ఈటల సమావేశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

హుజురాబాద్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొనని ఈటల.

తనకు ఆహ్వానం అందలేదని కేటీఆర్ తో చెప్పిన ఈటల రాజేందర్.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/