Last Updated:

AP Government: ప్లాస్టిక్ ఫ్లెక్సీ పై అడుగుకు వంద ఫైన్

రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనింది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అడుగుకు రూ. 100 ఫైన్ వేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

AP Government: ప్లాస్టిక్ ఫ్లెక్సీ పై అడుగుకు వంద ఫైన్

Amaravati: రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల పై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనింది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అడుగుకు రూ. 100 ఫైన్ వేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పర్యావరణ శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసాయి. నవంబర్ 1 నుండి తాజా ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. 1986 లో ప్రవేశపెట్టిన సెక్షన్ కింద జరిమానాతో పాటు శిక్షార్హులు అవుతారని ప్రభుత్వం హెచ్చరించింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఫెక్సీలను గుర్తించి తొలగించే అధికారాన్ని అధికారులకు ఇస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. కాటన్ బ్యానర్లను వినియోగించడమే ప్రత్యామ్నాయంగా  ప్రభత్వం పేర్కొనింది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ఫ్లెక్సీ నిషేద నిర్ణయంతో కొన్ని వర్గాల పై ప్రభావం చూపనుంది. లక్షలాది రూపాయలను వెచ్చించి ఏర్పాటు చేసిన మిషనరీలు, ఆ రంగం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న శ్రామికులు, కంప్యూటర్ ఆపరేటర్ల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. బ్యాంకుల నుండి రుణం తీసుకొన్న వారి పరిస్ధితి మరీ అధ్వానంగా మారింది. ప్లాస్టిక్ స్థానంలో కాటన్ బ్యానర్లను ముద్రించుకొనేందుకు అడుగుకు రూ. 30 మేర వ్యత్యాసం ఉండడంతో అనేక మంది బ్యానర్ల పై మక్కువ చూపడం లేదు.

ఇవి కూడా చదవండి: