Last Updated:

Dog Wedding: ప్రతి కుక్కకీ ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో.. కుక్కల కళ్యాణం

ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని చాలా సార్లు వింటూనే ఉంటాం. అయితే నిజంగానే ఆ డాగ్ కు కూడా ఒక రోజు వస్తే అందులోనూ అది పెళ్లిరోజు అయితే ఎలా ఉంటుందో తెలుసా. కుక్కలేంటీ పెళ్లిరోజు ఏంటీ అనుకుంటున్నారు కదా అయితే ఈ కథనం చదవాల్సిందే.

Dog Wedding: ప్రతి కుక్కకీ ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో.. కుక్కల కళ్యాణం

Dog Wedding: ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని చాలా సార్లు వింటూనే ఉంటాం. అయితే నిజంగానే ఆ డాగ్ కు కూడా ఒక రోజు వస్తే అందులోనూ అది పెళ్లిరోజు అయితే ఎలా ఉంటుందో తెలుసా. కుక్కలేంటీ పెళ్లిరోజు ఏంటీ అనుకుంటున్నారు కదా అయితే ఈ కథనం చదవాల్సిందే. ఓ రెండు పెంపుడు కుక్కలకు అంగరంగ వైభవంగా  సంప్రదాయ పద్దతిలో పెళ్లి తంతులో చెయ్యాల్సిని ప్రతీదానిని నిర్వహిస్తూ వేటిని మిస్ వాటికి పెళ్లి చేశారు. మరి ఈ విధంగా చూసుకుంటే ఆ కుక్కలకు ఇది చాలా మంచి రోజు మరియు ఎంతో ప్రత్యేకమైన రోజే కదా. ఇంతకీ ఈ విచిత్రం ఎక్కడ జరిగిందే అసలు ఎందుకు అలా చేశారో ఓ సారి చూద్దాం.

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ నగరంలో సవిత అలియాస్ రాణి, రాజా అనే దంపతులు స్వీటీ అనే ఆడకుక్కను పెంచుకుంటున్నారు. తమ పొరుగున ఉన్న మనీత అనే వాళ్ల ఇంట్లో షేరూ అనే మగ కుక్కను పెంచుకుంటూ ఉండేవారు. కాగా రాణి దంపతులకు పిల్లలు లేకపోవడం వల్ల స్వీటీనే తమ పిల్లలా పెంచుకునేవారు. అయితే ఆ కుక్కలు పెద్దవి అవడం వల్ల వాటికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నామని రాణి దంపతులు తెలిపారు. ఇంకేముందు అనుకున్నదే తడవుగా మనీతను ఒప్పించి షేరుకు స్వీటీకి వివాహం నిశ్చయించారు. పెళ్లి తంతు కదా ఏముందిలే కుక్కలే కదా అని కాకుండా హిందూ సంప్రదాయ పద్ధతిలో వాటికి ఘనంగా వివాహం జరిపించారు. ఈ కుక్కల వివాహం కోసం పాలం విహార్ ఎక్స్‌టెన్షన్‌లోని జిలే సింగ్ కాలనీ పరిసరాల్లోని తెలిసిన వారికి 100 ఆహ్వాన కార్డులు పంచామని మరి కొందరికి ఫోన్లు చేసి చెప్పామని సవిత వివరించారు. అంతే కాకుండా పెళ్లికి రెండు రోజుల ముందు ఆ రెండు కుక్కలకు మెహందీ, హల్దీ వేడుకలను కూడా నిర్వహించారు. తాము ఎనిమిదేళ్లుగా మగ కుక్క షేరును పెంచుకుంటున్నామని, దీన్ని తమ బిడ్డలాగా చూసుకుంటున్నామని, అందుకే మా పెంపుడు కుక్క పెళ్లిని వేడుకగా చేశామని యజమాని మనీత చెప్పారు.

కుక్కల పెళ్లికి కొందరు ఎంతో ఇష్టంతో వచ్చారని మణిత చెప్పారు. తన కూతురు లాంటి స్వీటీకి వంటపాత్రలు, చీరలు కొని వైభవంగా పెళ్లి చేశామని స్వీటీ యజమాని రాజా భావోద్వేగంతో చెప్పారు.
కుక్కల కళ్యాణోత్సవానికి హాజరైన ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు.

ఇదీ చదవండి

ఇవి కూడా చదవండి: