Supreme Court: కరోనా టీకా మరణాలకు కేంద్రం బాధ్యత వహించదు.. సుప్రీంలో అఫిడవిట్
కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా టీకా వల్ల సంభవించిన మరణాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదని వివరించింది.
Supreme Court: కరోనాను ఎదుర్కోవడానికి దేశంలోని దాదాపు ప్రజలంతా ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకున్నారు. కాగా ఈ టీకా వల్ల కొందరు మరణించారు. దానితో బాధితులు కోర్టును ఆశ్రయించారు. దానితో స్పందించిన కేంద్రం సుప్రీం కోర్టులో దీనిపై అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా టీకా వల్ల సంభవించిన మరణాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదని వివరించింది. కరోనా టీకా తీసుకున్న వ్యక్తి ఏదైనా దుష్పభ్రావాల వల్ల మరణించినట్టయితే సివిల్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసి పరిహారం కోరడమే మార్గమని పేర్కొంది.
గతేడాది కరోనా టీకా తీసుకున్న అనంతరం ఇద్దరు వేర్వేరు ప్రాంతాల యవతులు మరణించారు. దీంతో వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై స్పందనగా కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ వేసింది. కరోనా టీకాలు తీసుకున్న అనంతరం చోటు చేసుకున్న మరణాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు. టీకాలు తీసుకున్న తర్వాత తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే వెంటనే గుర్తించి సత్వర చికిత్స అందించే ప్రోటోకాల్ కోసం డిమాండ్ చేశారు.
ఇద్దరు యువతుల మరణాలపై కేంద్రం సంతాపం వ్యక్తం చేసింది. ఈ మరణాలు కరోనా టీకాల వల్లేనని నేషనల్ ఏఈఎఫ్ఐ కమిటీ గుర్తించినట్టు పేర్కొంది. జరిగిన నష్టంపై సివిల్ కోర్టును ఆశ్రయించి, పరిహారం కోరే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. 2022 నవంబర్ 19 నాటికి 219.86 కోట్ల కరోనా టీకా డోసులు ఇవ్వగా, 92,114 కేసుల్లో దుష్ప్రభావాలు కనిపించినట్టు తెలిపింది. ఇందులో 89,332 కేసులు స్వల్ప స్థాయివేనని మరో 2,782 కేసుల్లో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తాయని వివరించింది.
ఇదీ చదవండి: తెగ తిన్నారు.. మాంసం వినియోగంలో తెలంగాణ @1