Last Updated:

#RivabaJadeja: రివాబా జడేజా: భార్యను గెలిపించిన టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా

టీమిండియా స్టార్ క్రికెటర్ మరియు ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బౌలింగ్ తోనే కాకుండా బ్యాట్ తోనూ అద్భుతాలు చెయ్యగల సత్తా ఉన్న ఆల్ రౌండర్ గా జడేజాకు క్రికెట్ చరిత్రలో మంచి పేరుంది. ఐపీఎల్లో చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న జడేజా గతేడాది సీఎస్కేకు సారథ్యం కూడా వహించాడు. జడేజా బరిలోకి దిగి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు లేకపోలేదు. అలాగే ఈ సారి ఈయన భార్య కూడా బరిలో ఉన్నారు. అది క్రికెట్ మైదానంలో కాదండోయ్ గుజరాత్ ఎన్నికల్లో. ఇంతకీ జడేజా భార్య ఎవరు.. ఆమె ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించింది అనే విషయాలు తెలుసుకుందాం.

#RivabaJadeja: రివాబా జడేజా: భార్యను గెలిపించిన టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా

#RivabaJadeja: టీమిండియా స్టార్ క్రికెటర్ మరియు ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బౌలింగ్ తోనే కాకుండా బ్యాట్ తోనూ అద్భుతాలు చెయ్యగల సత్తా ఉన్న ఆల్ రౌండర్ గా జడేజాకు క్రికెట్ చరిత్రలో మంచి పేరుంది. ఐపీఎల్లో చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న జడేజా గతేడాది సీఎస్కేకు సారథ్యం కూడా వహించాడు. జడేజా బరిలోకి దిగి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు లేకపోలేదు. అలాగే ఈ సారి ఈయన భార్య కూడా బరిలో ఉన్నారు. అది క్రికెట్ మైదానంలో కాదండోయ్ గుజరాత్ ఎన్నికల్లో. ఇంతకీ జడేజా భార్య ఎవరు.. ఆమె ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించింది అనే విషయాలు తెలుసుకుందాం.

జడేజా కుటుంబానికి మొదటి నుంచి రాజకీయాలతో అవినాభావ సంబంధం ఉంది. ఆయన భార్య రివాబా జడేజాకు కూడా రాజకీయాలంటే ఆసక్తి ఎక్కువే. చిన్ననాటి నుంచి హిందూమత సంస్కృతి సాంప్రదాయాలను ఎంతో నిష్టగా పాటించే ఈమె కళాశాల రోజుల్లో తనకున్న ఈ రాజకీయ ఆసక్తితో కర్ణిసేనలో చేరారు. ఉత్తరాది ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యం కలిగిన కర్ణిసేనలో చేరిన ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలా రివాబా 2018లో కర్ణిసేనకు మహిళా విభాగ చీఫ్ గా వ్యవహిరించారు. ఈ కర్ణిసేన ద్వారా రివాబాకు ప్రజల్లో ఎంతో గుర్తింపు ఏర్పడింది. దీని ద్వారానే భారతీయ జనతా పార్టీ ఈమెను గుర్తించింది. ఈమె సేవలకు గానూ ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చోటుకల్పించారు. దానితో ఎన్నికల బరిలో నిలిచిన రివాబాకు తన భర్త జడేజా మద్దుతుగా నిలిచారు. మైదానంలో రంగంలోకి దిగి టీంని ఎలాగైతే విజయశిఖరాలకు తీసుకెల్తారో అలానే ఈ రాజకీయాల బరిలోనూ తన భార్యకు అండగా నిలిచి గెలిపించారు.

తనభార్యకు మద్దతుగా నిలిచిన కారణంగా రవీంద్ర జడేజా వివాదాల్లోకికెక్కారు. గాయం కారణంగా ఇటీవల జరిగిన ఆసియా ప్రపంచకప్ మరియు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్ కు జడేజా దూరమయిన సంగతి తెలిసిందే. కాగా ఫిట్నెస్ లేకపోవడం వల్ల అతడు తిరిగి జట్టులోకి రాలేకపోయాడు. దానితో జడేజా లేకపోవడం వల్లే టీమిండియా వరుసగా టోర్నీలు ఓడిపోయిందని కొందరు క్రికెట్ అభిమానులు అభిప్రాయడుతున్నారు. అయితే ఇదే సందర్భంలో తన భార్య రివాబాకు మద్దతుగా జడేజా ఎన్నికల
ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కావాలనే జడేజా టీమిండియాకు హ్యాండ్ ఇచ్చి పరోక్షంగా రాజకీయలవైపు నడక సాగిస్తున్నాడని పలువురు ఆరోపణలు గుప్పించారు. వాటినేమాత్రం ఖాతరు చెయ్యకుండా జడేజా తన భార్యకు మద్దతుగా నిలిచిన తీరు మరికొందరి ఆకర్షించింది.

తన ద్వారానే జడేజాకు రివాబా పరిచయం..

ఇకపోతే రివాబా జడేజా వ్యక్తిగతానికి వస్తే రివాబా జడేజా అసలు పేరు రివా సోలంకి. ఆమె 1990 నవంబర్ 2న రాజ్‌కోట్‌లో హర్‌దేవ్‌ సింగ్‌ సోలంకి, ప్రఫుల్లాబా దంపతులకు రివా సోలంకిగా జన్మించారు. రాజ్‌కోట్‌లోని ఆత్మియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ కళాశాల నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్నారు. ఆమె 2016 ఏప్రిల్ 17న టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజాను వివాహమాడింది. వారిద్దరికీ జూన్ 2017లో కూతురు నిధ్యాన జన్మించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. రవీంద్ర జడేజాతో పరిచయం కాకముందు అతడి సోదరి నైనా జడేజా, రివాబా మంచి స్నేహితులు. ఇలా రివాబాకు జడేజాకు మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం కాస్త వివాహంగా మారింది.

ఆది నుంచీ రాజకీయాలంటే ఇష్టం..

రివాబా జడేజాకు చిన్ననాటి నుంచీ రాజకీయాలంటే మక్కువ. ఆ ఇంట్రెస్ట్ తోనే ఆమె 2019లో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. రాజకీయాల్లోకి రాకమునుపే రివాబా 2018లో కర్ణిసేన మహిళా విభాగానికి చీఫ్‌గా వ్యవహరించింది. ఇక ఆమె కమలదళంలో చేరాక జామ్‌నగర్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించి అక్కడి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేస్తోంది. ముఖ్యంగా బాలికల సంక్షేమంపై దృష్టిసారించి తనదైన శైలిలో పరిష్కారాలు చూపిస్తూ నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంటారు. రివాబాకు నెట్టింట లక్షల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. అంతే కాకుండా రివాబా జడేజా శ్రీ మాతృశక్తి చారిటబుల్‌ ట్రస్ట్‌ను స్థాపించి దాని ద్వారా ఆమె గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

తానో వైపు కుటుంబం మరోవైపు..

రవీంద్ర జడేజా కుటుంబసభ్యులంతా మొదటి నుంచీ కాంగ్రెస్‌ మద్దతుదారులే. అయితే ప్రస్తుతం రివాబా జడేజా మాత్రం భాజపా తరఫున పోటీ చెయ్యడం ఆమె కుటుంబ సభ్యులు అయిన రివాబా మామ, జడేజా తండ్రి అనిరుద్ధ్ సిన్హ్, ఆడపడచు మరియు తన స్నేహితురాలు అయిన నైనబా జడేజా మాత్రం కాంగ్రెస్ కే మద్దతిస్తూ ప్రచారం చేశారు. ఇదేంటని చాలా మంది వారిని ప్రశ్నించారు. దానికి.. కుటుంబం వేరు, పార్టీ వేరు. ఈ రెండింటినీ సరిపోల్చకూడదు. ఎన్నో ఏళ్లుగా తాను కాంగ్రెస్‌కు మద్దతుదారుడిగా ఉన్నానని.. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌తోనే ఉంటాను అని జడేజా తండ్రి అనిరుద్ధ్ సిన్హ్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే నైనబా జడేజా కూడా దీనిపై స్పందించారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్నంత మాత్రాన తన వదినపై గానీ, సోదరుడిపై గానీ ప్రేమ ఏమాత్రం తగ్గదని నైనబా అన్నారు. ‘మా కుటుంబంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంది. ఎవరికి నచ్చిన పనిని వారు చేసుకునే హక్కు ఉంది’ అని ఆమె తెలిపారు. రాజకీయాల్లో ఇది కొత్తేం కాదని, గతంలో చాలా కుటుంబాల్లో ఇలాంటివి జరిగాయని రివాబా జడేజా అంటున్నారు. తన భర్త రవీంద్ర జడేజా తనకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారని ఆమె తెలిపారు.

రవీంద్ర జడేజా రథసారధిగా మారి తన భార్య రివాబాను ఈ విధంగా ఎన్నో విమర్శలు, మరెన్నో ఒడుదొకులు ఎదుర్కొని ఎన్నికల్లో గెలిపించారు. మరి ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా జడేజా నెక్ట్స్ స్టెప్ ఏంటి? గుజరాత్ బీజేపీ ప్రభుత్వంలో మంత్రి అవుతారా? లేదా అనేది వేచి చూడాలి.

ఇదీ చదవండి: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం

ఇవి కూడా చదవండి: