Last Updated:

Central Minister: మరో కేంద్ర మంత్రిపై అరెస్ట్ వారెంట్

పలుకేసుల్లో వివిధ మంత్రులకు కోర్టులు ఇటీవల కాలంలో అరెస్ట్ వారెంట్ జారీ చెయ్యడం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ కు కళ్యాణదుర్గం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరోవైపు చోరీ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్‌ ప్రామాణిక్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన రెండు రోజులకే మరో కేంద్ర మంత్రికి పశ్చిమ బెంగాల్‌లోని ఓ కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

Central Minister: మరో కేంద్ర మంత్రిపై అరెస్ట్ వారెంట్

Central Minister: పలుకేసుల్లో వివిధ మంత్రులకు కోర్టులు ఇటీవల కాలంలో అరెస్ట్ వారెంట్ జారీ చెయ్యడం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ కు కళ్యాణదుర్గం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరోవైపు చోరీ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్‌ ప్రామాణిక్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన రెండు రోజులకే మరో కేంద్ర మంత్రికి పశ్చిమ బెంగాల్‌లోని ఓ కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ 2019, ఏప్రిల్‌ 4న తుఫాన్‌గంజ్‌లో కేంద్ర మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి జాన్‌ బార్లా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పోలీసుల అనుమతి కూడా తీసుకోలేదు. దీనితో స్థానిక బోక్సిర్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో పలుమార్లు తుఫాన్‌గంజ్‌ సబ్‌ డివిజనల్‌ కోర్టు మంత్రికి సమన్లు జారీ చేసినా, ఆయన ప్రతిసారి కోర్టుకు గౌర్హాజరు అయ్యారు. కాగా ఈ నెల 15వ తారీఖు కూడా కోర్టుకు హాజరు కావాలని మరోసారి మంత్రికి సమన్లు జారీ చేసింది. అప్పటికీ ఆయన కోర్టుకు హాజరు కాకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, కోర్టు ధిక్కరణ కింద కేంద్ర మంత్రికి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 72 గంటల వ్యవధిలో ఇద్దరు కేంద్ర మంత్రులకు కోర్టులు అరెస్ట్‌ వారెంట్లు జారీచేయటం చర్చనీయాంశంగా మారింది. 13 ఏండ్ల కిందట దొంగతనం చేసిన కేసులో అలీపూర్‌దౌర్‌ జ్యుడీషియల్‌ కోర్టు ఈ నెల 14న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్‌పై అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసిన సంగతి మరువక ముందే ఇలా మరో కేంద్రమంతికి అరెస్ట్ వారెంట్ జారీ చెయ్యడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

ఇదీ చదవండి: రాజీవ్ గాంధీ హత్య కేసు.. దోషులను విడుదల చేయడం పై సుప్రీంలో కేంద్రం రివ్యూ పిటిషన్

ఇవి కూడా చదవండి: