Last Updated:

Sai Kiran: సీరియల్‌ నటితో పెళ్లికి రెడీ అయిన సాయి కిరణ్‌ – ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలతో సర్‌ప్రైజ్‌

Sai Kiran: సీరియల్‌ నటితో పెళ్లికి రెడీ అయిన సాయి కిరణ్‌ – ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలతో సర్‌ప్రైజ్‌

Actor Sai Kiran Engagement Photos Goes Viral: ఒకప్పటి హీరో సాయి కిరణ్‌ పెళ్లికి రెడీ అయ్యాడు. 46 ఏళ్ల వయసులో సీరియల్‌ నటితో త్వరలోనే ఆయన ఏడడుగులు వేయబోతున్నారు. ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తున్న సాయి కిరణ్‌ తనతో పాటు కోయిలమ్మ సీరియల్లో నటించిన నటి స్రవంతిని నిశ్చితార్థం చేసుకుని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫోటోలను నటి స్రవంతి షేర్‌ చేయడంతో ఫోటోలు వైరల్‌గా మారాయి. “మీ అండ్‌ యూ ఫరెవర్‌.. ఎంగేజ్డ్‌” అని పోస్ట్‌లో పేర్కొంది. దీంతో ఈ కొత్త జంటకు టీవీ నటీనటులంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే గతంలో సాయి కిరణ్‌కు పెళ్లయినట్టు తెలుస్తోంది. 2010లో వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లి కాగా వీరిద్దరికి ఓ పాప కూడా ఉన్నట్టు సినీవర్గాల నుంచి సమాచారం. పెళ్లయిన కొత్తకాలానికి మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని వీరిద్దరి విడిపోయారు. అప్పటి నుంచి సింగిల్‌గా ఉంటున్న సాయి కిరణ్‌.. కోయిలమ్మ సీరియల్లో తనతో పాటు నటించిన స్రవంతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇప్పుడు వీరిద్దరు పెళ్లికి రెడీ అయ్యారు.

కాగా తరుణ్‌-రిచాల ‘నువ్వే కావాలి’ సినిమాతో సాయి కిరణ్‌ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో తనదైన నటనతో ఆకట్టుకున్న ఆయన హీరోగా అవకాశాలు అందుకున్నాడు. అలా ‘ప్రేమించు’, ‘మనసుంటే చాలు’, ‘ఎంత బావుందో’ తదితర సినిమాల్లో హీరోగా నటించారు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు తగ్గడంతో జగపతి, షిరిడి షాయి, నక్షత్రం వంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించారు. ప్రస్తుతం సాయి కిరణ్‌ బుల్లితెరపై నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా గుప్పెడంత మనసులో రిషి తండ్రి మహేంద్ర పాత్రకు ఎనలేని గుర్తింపు వచ్చింది.

ఇవి కూడా చదవండి: