Home / అంతర్జాతీయం
ఈ ఎవర్గ్రీన్ మెరైన్ కంపెనీకి చెందిన కంటైనర్ షిప్ 2021లో సూయజ్ కెనాల్లో మునిగిపోయింది. ఎవర్‌గ్రీన్‌లో వార్షిక వేతనాలు 44,745 డాలర్లు
పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌ల లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ భూకంపం చోటు చేసుకుంది. రాత్రి 10.20 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భవనాలు దెబ్బతినడం, కొండచరియలు విరిగిపడడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది.
రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జాకీర్ నాయక్‌ను ఒమన్ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. మార్చి 23న ఒమన్ పర్యటన సందర్భంగా నాయక్‌ను అదుపులోకి తీసుకునేందుకు భారత నిఘా సంస్థలు ఇప్పటికే ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
ప్రతి ఏటా మార్చి 20 ప్రపంచ సంతోష దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. ఐక్య రాజ్యసమితి వార్షిక హ్యాపీనెస్ సూచీల ప్రకారం..
అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఎంఎఫ్ ) శ్రీలంక యొక్క దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో సహాయపడటానికి నాలుగు సంవత్సరాలలో దేశం కోసం దాదాపు $3 బిలియన్ల బెయిలౌట్ కార్యక్రమాన్ని ఆమోదించింది. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపిందని ఐఎంఎఫ్ సోమవారం ప్రకటించింది.
ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 92 ఏండ్ల వయసులో ఐదో పెండ్లికి సిద్ధమవుతున్నారు. తన ప్రియురాలు అయిన 65 ఏళ్ల యాన్ లెస్లీ స్మిత్ ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు.
భారత్ నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ పేరును ఇంటర్‌పోల్ వాంటెడ్ లిస్ట్ నుంచి తొలగించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ. 13,000 కోట్ల మేర మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీని డిసెంబర్ 2018లో ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులో చేర్చారు.
“ఆర్ఆర్ఆర్” లోని నాటు నాటు పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా కూడా నాటు నాటు అంటూ అందరూ ఊగిపోతూనే ఉన్నారు.
ఫ్లోరిడా ప్రాథమిక తరగతుల్లో రుతుచక్రాలు మరియు ఇతర మానవ లైంగికత అంశాలపై చర్చలను నిషేధించే అవకాశం ఉంది. ఇప్పటికే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు మెజారిటీ ఓట్లతో ఆమోదం పొందుతుందని భావించారు.
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తన ప్రభుత్వం ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి తక్కువ-ఆదాయ ప్రజలకు సబ్సిడీపై పెట్రోల్ అందించనున్నట్లు ప్రకటించారు.లీటరుకు 50 రూపాయల సబ్సిడీని ఉపశమన ప్యాకేజీలో భాగంగా ఇవ్వనున్నారు.