Last Updated:

Powerful Passport: ప్రపంచంలో పవర్ ఫుల్ పాస్‌పోర్ట్‌ ఏ దేశానిదో తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ విషయానికి వస్తే జపాన్‌ నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించింది. వరుసగా ఐదో సంవత్సరం జపాన్‌ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జపాన్‌ ప్రపంచంలోని 193 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా వెళ్లి రావచ్చు.

Powerful Passport: ప్రపంచంలో పవర్ ఫుల్ పాస్‌పోర్ట్‌ ఏ దేశానిదో తెలుసా?

Powerful Passport: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ విషయానికి వస్తే జపాన్‌ నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించింది. వరుసగా ఐదో సంవత్సరం జపాన్‌ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జపాన్‌ ప్రపంచంలోని 193 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా వెళ్లి రావచ్చు. లేదా ఆన్‌ అరైవెల్‌ అంటే దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పటికప్పుడు వీసా ఇవ్వడం జరుగుతుంది దాన్ని పొందవచ్చు. జపాన్‌ తర్వాత దక్షణి కొరియా, సింగపూర్‌లు సంయుక్తంగా రెండో స్థానం దక్కించుకున్నాయి. ఈ రెండు దేశాలకు చెందిన పాస్‌పోర్టు హోల్డర్లు 192 దేశాలకు ఎలాంటి వీసాలు లేకుండా పర్యటించి రావచ్చు. మూడోస్థానంలో స్పెయిన్‌ ఉంది. కాగా స్పెయిన్‌కు చెందిన పౌరులు కూడా 190 దేశాలకు ఎలాంటి వీసాలు లేకుండా చుట్టిరావచ్చు. బ్రిటన్‌, అమెరికా పాస్‌పోర్టులు వరుసగా ఆరు, ఏడు స్థానాలను ఆక్రమించాయి. ఈ రెండు దేశాలకు చెందిన పౌరులు 187, 186 దేశాలకు ఎలాంటి వీసాలు లేకుండా పర్యటించవచ్చు. కాగా ఈ రెండు దేశాలు 2014లో మొదటిస్థానాన్ని ఆక్రమించాయి. క్రమంగా వెనుకబడ్డాయి.. అటు నుంచి మొదటిస్థానాన్ని చేరుకోలేకపోయాయి.

కరోనా తర్వాత పుంజుకున్న పర్యాటకం

హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ ప్రకారం అట్టడుగు స్థానంలో ఆఫ్గానిస్తాన్‌, సిరియాలు ఆక్రమించాయి. ఈ రెండు దేశాలకు చెంది పౌరులు వరుసగా 29,30 దేశాలకు వీసా లేకుండా పర్యటించిరావచ్చు. కాగా హెన్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ది ఇండెక్స్‌ నుంచి ప్రత్యేకంగా సేకరించిన గణాంకాలను తీసుకుని ర్యాంకులను కేటాయించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 15వ స్థానాన్ని ఆక్రమించిందని హెన్లే పాస్‌పోర్టు ఇండెక్స్‌ వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం  యూఎఈ పాస్‌పోర్టు కలిగిన వారు ప్రపంచంలోని పలు దేశాలను వీసా లేకుండానే సందర్శించవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం కూడా క్రమంగా పుంజుకుంటోంది. కరోనా కంటే ముందు నాటితో పోల్చుకుంటే పర్యటక రంగం 75 శాతానికి చేరుకుందని రెవెంజ్‌ ట్రావెల్ వెల్లడించింది. ఎమిరాటి పాస్‌పోర్టు కలిగిన వారు ప్రపంచంలోని 227 దేశాల్లో 178 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా నిరభ్యంతరంగా చుట్టిరావచ్చు.

పాస్ పోర్ట్ లేకుండానే చాలా దేశాలు చుట్టేయొచ్చు..

ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే దాని ప్రభావం పాస్‌పోర్టుపై కనిపిస్తోంది. అత్యధికంగా ర్యాంకింగ్‌ కలిగిన దేశాలు.. ప్రపంచంలోని పలు దేశాలను వీసా లేకుండానే ఆ దేశంలో పర్యటించవచ్చు. ఉదాహరణకు జపాన్‌ను తీసుకుంటే.. జపాన్‌ సుమారు 98 శాతం దేశాలను వీసా లేకుండానే పర్యటించి రావచ్చు. దీనికి వ్యతిరేకంగా ఆఫ్గానిస్తాన్‌ నుంచి తీసుకుంటే పాస్ పోర్ట్ లేకుండా ఒక శాతం దేశాలను కూడా చుట్టిరాలేవు. గ్లోబల్‌ సిటిజన్స్‌, అంతర్జాతీయంగా వ్యాపారాలు చేసే వారు. తరచూ విదేశాల్లో వ్యాపారనిమిత్తం పర్యటించే వారు ఆయా దేశాల పాస్‌పోర్టులను పరిగణనలోకి తీసుకొని తమ వ్యాపార లావాదేవీలను విస్తరించుకొనే అవకాశాలున్నాయి. వీసా ఫ్రీ దేశాల్లో పర్యటిస్తున్నందువ వల్ల ప్రపంచ జీడీపీ ఏ స్థాయిలో ఉందో శక్తిమంతమైన పాస్‌పోర్టు హోల్డర్లు అంచనాకు రావచ్చునని బ్రిటన్‌కు చెందిన హెన్లీ అండ్‌ పార్టనర్స్‌ చైర్మన్‌ క్రిస్టియన్‌ కెలిన్ అన్నారు.

అంతర్జాతీయ ప్రయాణికులు ఇటీవల కాలంలో గల్ప్‌ దేశాలకు రికార్డు స్థాయిలో రావడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పటికే డజన్ల కొద్ది దేశాలు గోల్డెన్‌ వీసా స్కీలను ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ కల్చర్‌ కూడా మారిపోయింది. గతంలో మాదిరిగా ఆఫీసులకు వెళ్లి పనిచేయాల్సిన అవసరం లేదు. వర్క్‌ ఫ్రం హోం కల్చర్‌ వచ్చాక చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్లి అక్కడి నుంచి పనిచేసుకుంటున్నారు. ఉదాహరణకు పన్ను రాయితీలు ఎక్కువగా ఇచ్చే దేశాలకు వీరంతా తరలివెళ్లి తమ పన్ను ఆదా చేసుకుంటున్నారు. అక్కడే స్థిరాస్తులను కొంటున్న సంఘటనలు ఉన్నాయి. ఉక్రెయిన్‌, రష్యాలు రెండు దేశాలు యుద్ధానికి దిగాయి. అయినా ఈ రెండు దేశాల పాస్‌పోర్ట్‌ల ర్యాంకుల్లో ఎలాంటి మార్పుల్లేవు. వరుసగా 36, 49 ర్యాంకులు సాధించాయి.

ఇండియాకు దక్కని చోటు

ఉక్రెయిన్‌, రష్యా దేశాలకు చెందిన ఎయిర్‌ స్పేస్‌ ప్రస్తుతం మూతపడ్డాయి.

దీంతో పాటు రష్యాపై అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూరోపియన్‌ ఆంక్షలు విధించింది. కాగా రష్యా పౌరులు హై ఇన్‌కం దేశాల్లో పర్యటించడాన్ని కొన్ని దేశాలు అనుమతించడం లేదు.

అదే సమయంలో యూరోపియన్‌ యూనియన్‌ ఎమర్జెన్సీ ప్లాన్‌ను అమల్లోకి తెచ్చింది. ఉక్రెయిన్‌ పౌరులు తమ దేశాల్లోకి నిరభ్యంతరంగా రావచ్చునని పేర్కొంది. వీరంతా తమ దేశాల్లో మూడు సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసుకోవడంతో పాటు నివసించడానికి అనుమతించాయి. తూర్పు యూరోపియన్‌ దేశాలు పాస్‌పోర్టు ఇండెక్స్‌లో దశాబ్ద కాలం నుంచి 24వ స్థానంలో కొనసాగుతోంది. ఒక వేళ ఈస్ర్టన్‌ యూరోపియన్‌ యూనియన్‌లో చేరితే ప్రపంచంలోని టాప్‌ 10 శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో చేరిపోతుంది. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టు(Powerful Passport)ల్లో జపాన్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, జర్మనీ, స్పెయిన్‌తో పాటు పలు దేశాలు సాధించినా.. ఇండియా మాత్రం ఆ జాబితాలో లేదు.

ఇవి కూడా చదవండి

Ram Charan: రామ్‌చరణ్ మెగా రివీల్: నెక్ట్స్ మార్వెల్ హీరో.. ఐరన్ మ్యాన్ vs కెప్టెన్ అమెరికా.. నేను నటించే సూపర్ హీరో క్యారెక్టర్ ఏంటంటే..

Ram Charan: రామ్‌చరణ్ గోల్డెన్ గ్లోబ్ ఇంటర్వ్యూ: ఏం యాక్సెంట్‌రా బాబూ.. మెగా పవర్‌స్టార్ అదరగొట్టేశాడు..

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: