Health Tips: ఆ 5 పోషకాలను తీసుకుంటే చాలు రక్తకణాలు పెరుగుతాయి..
మహిళలలో రక్తం తక్కువ ఉంది అనే సమస్యను తరచూ వింటూనే ఉంటుంది. ఇది తీవ్రమైన అనీమియా వ్యాధిగా కూడా మారుతుంది. ప్రపంచ జనాభాలో నూటికి సుమారు 50శాతం మందికి పైగా ఎర్రరక్తకాణాలు తక్కువుగా ఉంటున్నాయి.
Health Tips: మహిళలలో రక్తం తక్కువ ఉంది అనే సమస్యను తరచూ వింటూనే ఉంటుంది. ఇది తీవ్రమైన అనీమియా వ్యాధిగా కూడా మారుతుంది. ప్రపంచ జనాభాలో నూటికి సుమారు 50శాతం మందికి పైగా ఎర్రరక్తకాణాలు తక్కువుగా ఉంటున్నాయి. ఈ సమస్యకు కారణం పౌష్టికాహార లోపంగా ఆహార నిపుణులు మరియు వైద్యులు తెలుపుతున్నారు. మరి ఈ సమస్య నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎర్రరక్తకాణాలు శరీరంలో తగిన మోతాదులో ఉండాలంటే ఏఏ ఆహార పదార్ధాలు తీసుకోవాలో ఓ సారి చూద్దామా..
ఆ 5 పోషక పదార్ధాలను లేదా ఫుడ్ సప్లిమెంటరీ పదార్ధాలను తీసుకోవడం ద్వారా ఎర్ర రక్తకణాలను పెంచుకోవచ్చు అవేంటో చూద్దాం..
ఐరన్
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు అయిన ఆకుకూరలైన పాలకూర, కాలే, రాగులు, బీన్స్, కోడిగుడ్డులోని సొన, డ్రై ఫ్రూట్స్, మాంసం మొదలైనవి ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ఐరన్ అందిచగలము. బాడీలో ఐరన్ పెరుగుదల అనేది ఎర్ర రక్తకణాలు ఏర్పడడానికి తోడ్పడుతుంది.
- ఓ సాధరణ మహిళకి రోజుకి 18 మిల్లీ గ్రాములు, పురుషుడిగా 8 మిల్లీ గ్రాముల ఐరన్ అవసరం.
ఫోలిక్ యాసిడ్( విటమిన్ బి9)
రోజువారీ ఆహారంలో విటమిన్ బి9 లేదా ఫోలిక్ యాసిడ్ని తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలను పెంచుకోవచ్చు. మరి ఈ విటమిన్ బ్రెడ్స్, ధాన్యాలు, ఆకుకూరలు, లెంటిల్స్, నట్స్ వంటి పదార్ధాలలో ఎక్కువగా ఉంటుంది.
- ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజుకు 100 నుంచి 250 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ అవసం. ప్రెగ్నెంట్ అయితే 600 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ను తీసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ బి12
మాంసం, చేప, డైరీ ఉత్పత్తులు, గుడ్లు వంటి పదార్ధాలలో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ కూడా ఎర్ర రక్తకణాలు పెరగడానికి దోహదం చేస్తుంది.
- 14ఏళ్లకు పైబడిన వారికి రోజుకి 2.4 మైక్రో గ్రాముల విటమిన్ 12 అవసరం. అదే ప్రెగ్నెంట్ అయితే 2.6గాను పాలు పట్టించే తల్లికి అయితే ఈ విలువ 2.8 మైక్రోగాములుగా ఉంటుంది.
కాపర్
పౌల్ట్రీ ఉత్పత్తులు, షెల్ ఫిష్, లివర్, బీన్స్, చెర్రీస్, నట్స్ వంటి పదార్ధాలతో కాపర్ అధికంగా ఉంటుంది.
- మహిళకు రోజుకు 18 మిల్లీ గ్రాములు మరియు పురుషుడికి 8 మిల్లీ గ్రాముల కాపర్ అవసరం.
విటమిన్ “ఏ”
స్వీట్ పొటాటో, కారెట్స్, రెడ్ పెప్పర్స్, పండ్లు వంటి పదార్ధాలలో విటమిన్ “ఏ” అధికంగా ఉంటుంది. వీటికి తోడు ఎర్రరక్తకణాలు మరీ తక్కువగా ఉన్న వారికి తగిన మోదులో వైద్యులు ఫుడ్ సప్లిమెంటరీలను తీసుకోమని చెప్తారు. వైద్యుల అనుమతి లేకుండా మాత్రం ఫుడ్ సప్లిమెంటరీలను తీసుకోకూడదు.
- సాధారణంగా ఆరోగ్యవంతమైన మహిళకు రోజుకు 700 మైక్రోగ్రాములు మరియు పురుషుడికి 900 మైక్రోగ్రాముల విటమిన్ “ఏ”అవసరం అవుతుంది.