Last Updated:

NIMHANS: పని ఒత్తిడిని గుర్తించడానికి ఓ సాధనం.. అదెంటో తెలుసా?

NIMHANS: పని ఒత్తిడిని గుర్తించడానికి ఓ సాధనం.. అదెంటో తెలుసా?

NIMHANS: ఒత్తిడిలేని జీవితాన్ని ఊహించలేము.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఉద్యోగులు తీవ్ర‌మైన ప‌ని ఒత్తిడితో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ముఖ్యంగా కార్పోరేట్ రంగంలో పని చేసేవారు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యతో.. చాలామంది మానసిక ఒత్తిడికి గురై.. అనేక రోగాల పాలవుతున్నారు. దీంతో అధిక ర‌క్త‌పోటు, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. వ్యక్తుల్లో ఈ పని ఒత్తిడిని గుర్తించేందుకు నేషనల్ ఇని స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ఓ సాధనాన్ని రూపొందించింది. TAWS -16 అనే పేరుతో రూపొందించే ఈ సాధనం.. వ్యక్తిలో ఒత్తిడిని గుర్తించి.. సంకేతాలు జారీ చేస్తుంది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం పని ఒత్తిడిని ఏదైనా ఉద్యోగ అవసరాలు కార్మికుని సామర్థ్యాలతో సరిపోలనప్పుడు.. సంభవించే శారీరక భావోద్వేగ ప్రతిస్పందనలే ఒత్తిడిగా నిర్వచించబడుతుంది. ఒక నిర్దిష్ట స్థాయి ఒత్తిడి.. కార్మికుడి సామార్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో పని నాణ్యతలో తగ్గుదల కనిపిస్తుంది.

ఇలాంటి ఒత్తిడిని ఉద్యోగుల్లో అంచనా వేయడానికి నిమ్ హన్స్ TAWS 16 ని రూపొందించింది. ఈ సాధనం పని ఒత్తిడిని అంచనా వేయడానికి.. మూడు ముఖ్యమైన అంశాలను అనుసంధానం చేస్తుంది. పని ఒత్తిడి, భావోద్వేగాలు.. ఒత్తిడిని సూచించే లక్షణాలు. ఇది వివిధ సారూప్య సాధనాల మధ్య ఒక గోడగా పని చేస్తుంది. ఈ TAWS-16ను నిమ్ హన్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గురురాజ్ గోపాలకృష్ణ సహకారంతో.. సెంటర్ ఫర్ పబ్లిక్ హెల్త్ పరిశోధనా బృందం, నిమ్హాన్స్‌లోని ఎపిడెమియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ గౌతమ్ మేలూర్ అభివృద్ధి చేసింది.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో దాదాపు 40% మంది కార్మికులుగా ఉన్నారు. అందులో 9% మంది సంఘటిత రంగాల్ ఉండగా.. అసంఘటిత రంగాల్లో కార్మికులుగా ఉన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2012-2030 అంచన ప్రకారం.. మానసిక ఆరోగ్య పరిస్థితుల కారణంగా దేశంలో 1.03 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం ఉంటుందని అంచనా వేసింది. 2019లో హుష్ అనే స్టార్టప్ నిర్వహించిన ఉద్యోగుల సర్వేలో దేశంలో కార్పోరేట్ రంగంలో ప్రతి ఐదుగురిలో ఒకరు పని ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొంది.

TAWS-16 అంటే ఏమిటి?..

TAWS-16లో 16 ప్రశ్నల చొప్పును రెండు సెట్లను కేటాయిస్తారు. ఇందులో A , B రెండు విభాగాలు కలిగి ఉంటాయి.

ఒక్కొ విభాగం 16 ప్రశ్నలతో ఉంటుంది. ఇది వ్యక్తుల ప్రతిస్పందన ఆధారంగా.. తమ ఉద్యోగులకు సహాయం చేయడంలో వీటిని ఉపయోగిస్తారు.

ఇక ఇందులో మూడు రకాల (ఎరుపు, పసుపు, ఆకుపచ్చ)కేటగిరీలు ఉంటాయి.

అందుకే దీనికి TAWS-16 అని పేరు పెట్టినట్లు.. కాన్సెప్ట్ టూల్‌ను తయారు చేసిన గౌతమ్ తెలిపారు.

ఈ సాధనంతో సులభంగా ఒత్తిడిని గుర్తించవచ్చని ఆయన తెలిపారు.

2015-2016లో ఈ సాధనాన్ని అభివృద్ధి చేశామని.. అనేక కార్యాలయాల్లో పైలట్ చేయబడిందని పేర్కొన్నారు.

ఈ సాధనం 2019-2020లో అందుబాటులోకి వచ్చిందని గౌతమ్ తెలిపారు.

 

ప్రస్తుత ఒత్తిడి అంచనా సాధనాలు.. వాటి పరిమితులు

ప్రస్తుతం.. పని ఒత్తిడిని కొలిచేందుకు.. అనేక సాధనాలు ఉన్నాయి. కాని ఇందులో ఎక్కువగా పనికి సంబంధం లేని అనేక ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఒత్తిడిని అంచనా వేస్తున్నారు. పనికి సంబంధం లేని విషయాలను తీసుకోవడం ద్వారా.. ఎక్కువ అంశాలను అంచనా వేయాల్సి వస్తుందని తెలిపారు. ఉద్యోగుల భావోద్వేగా సామర్థ్యాలను.. శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకోవద్దని గౌతమ్ తెలిపారు.

TAWS-16 యొక్క ప్రయోజనాలు..

>ఈ సాధనం ముఖ్యంగా దేశ శ్రామికశక్తికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది.

> ఇది భారతీయులు ఎదుర్కొనే సాధారణ పని-ఒత్తిడిని గుర్తించి.. వాటిని జాబితా రూపంలో నిర్ణయించబడతాయి.

> కార్యాలయంలో ఇచ్చిన పని-సంబంధిత ఒత్తిడిని ప్రత్యేకంగా అంచనా వేస్తుంది.

> ఇది పని-ఒత్తిడికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది

>ఒత్తిళ్లకు గురికావడం.. ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, ​​పని-ఒత్తిడి స్థాయిని పరిగణలోకి తీసుకుంటుంది.

> పని ఒత్తిడిని గుర్తించేందుకు తక్కువ సమయం తీసుకుంటుంది.
> ఇది కేవలం 6-12 నిమిషాల మధ్య మాత్రమే ఒత్తిడిని గుర్తిస్తుంది.

> ఇది మాన్యువల్‌గా లేదా వెబ్ ఆధారితం ద్వారా పని ఒత్తిడిని గుర్తించవచ్చు.

>ఈ సాధనం ద్వారా ఫలితాలు వెంటనే అందించవచ్చు.

> ఈ సాధనం ద్వారా.. ఒత్తిడితో ప్రభావితమైన వారిని వర్గీకరిస్తుంది.

TAWS-16ని ఎలా నిర్వహించాలి?

“TAWS-16ని ఉపయోగించాలనుకునే సంస్థ లేదా వ్యక్తి 080-26995868ని సంప్రదించాల్సి ఉంటుంది. లేదా నిమ్ హన్స్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందులో పాల్గొనేవారి విషయాలు గోప్యంగా ఉంచాలా వద్దా అనేది సంస్థపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/