Last Updated:

Yashoda Trailer: సమంతా “యశోద” కోసం బరిలోకి దిగినా ఐదుగురు స్టార్ హీరోలు

యశోద సినిమాను దాదాపు అన్ని భాషల్లో విడుదల చేస్తోన్న మన అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో విడుదల చేయించేందుకు రెడీ అవుతుంది.

Yashoda Trailer: సమంతా “యశోద” కోసం బరిలోకి దిగినా ఐదుగురు స్టార్ హీరోలు

Tollywood: ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంతా ట్రెండ్ అవుతోంది. ఆమె సర్జరీ చేపించుకున్నరని రూమర్లు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఐతే వాటిలో ఎంత నిజం ఉన్నదా అని సమంతకే తెలియాలి. కానీ సమంత ముఖంలో చాలా మార్పులు వచ్చినట్టు కనిపిస్తున్నాయని ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే, సమంత తన యశోద సినిమాను ప్రమోట్ చేయాలని ఫిక్స్ ఐనట్టు తెలుస్తుంది. అందుకే ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు యశోద కోసం సోషల్ మీడియాను ఎంచుకున్నట్టు తెలుస్తుంది.

సమంత “యశోద ” సినిమా కోసం ఒక అడుగు ముందుకు వేసినట్టు తెలుస్తుంది. దాని కోసం తన కాంటాక్ట్‌లను వాడుతున్నట్టు తెలుస్తుంది. సమంత తన క్లోజ్ ఫ్రెండ్స్ కమ్ స్టార్ హీరోలైనా వారిని రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. యశోద సినిమాను దాదాపు అన్ని భాషల్లో విడుదల చేస్తోన్న మన అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో విడుదల చేయించేందుకు రెడీ అవుతుంది.

సూర్యతో తమిళ ట్రైలర్‌ను విడుదల చేయిస్తుంది. ఇక రక్షిత్ శెట్టి ఛార్లీ సినిమాతో మంచి పేరు తెచ్చుకోవడంతో రావడంతో కన్నడ ట్రైలర్‌ను అతనితో విడుదల చేయిస్తోంది. వరుణ్‌ ధావన్‌తో హిందీ ట్రైలర్‌ను విడుదల చేయిస్తుంది. ఇక మలయాళం ట్రైలర్‌ను దుల్కర్ సల్మాన్ తో విడుదల చేయిస్తుంది. తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండతో విడుదల చేయిస్తుందని తెలుస్తోంది. మొత్తానికి సమంత యశోద సినిమా ట్రైలర్ తో కొత్త ట్రెండు క్రియేట్ చేయాలని చూస్తోంది.

ఇవి కూడా చదవండి: