Bhimavaram: భీమవరంలో ఖుషీ సినిమా ప్రదర్శనలు నిలిపివేత.. రోడ్లపైకి వచ్చి రచ్చరచ్చ చేసిన అభిమానులు
లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల థియేటర్లో ఖుషీ సినిమా షోలను నిలిపివేస్తున్నాము.. ముందుగా ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బు రీ ఫండ్ చేయపడుతుంది.
Bhimavaram: ఏపీలో రాజకీయాల ఎఫెక్ట్ సినిమాలపై కూడా ప్రభావం చూపడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అందులోనూ పవన్ కళ్యాణ్ సినిమాలపై అయితే అధికార పార్టీ కక్షకట్టినట్టు వ్యహరిస్తూ ఉండడం వకీల్ సాబ్ మూవీ నుంచి తెలిసిందే. వకీల్ సాబ్ మూవీకి అప్పట్లో జగన్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో 20ఏళ్ల క్రితం సినిమాను ఇప్పుడు అభిమానుల కోరిక మేరకు రీరిలీజ్ చేస్తున్నా దానికి కూడా ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అధికారులు. తాజాగా ఆంధ్రప్రదేశ్ భీమవరంలో ఓ థియేటర్ ముందు పెట్టిన గమనిక బోర్డు చూస్తే పవన్ పై జగన్ గవర్నమెంట్ ఎంత పగబట్టినట్టు వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల థియేటర్లో ఖుషీ సినిమా షోలను నిలిపివేస్తున్నాము.. ముందుగా ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బు రీ ఫండ్ చేయపడుతుంది అంటూ థియేటర్ యాజమాన్యం పేర్కొనింది. దీనిపై పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ధర్నాలు చేపట్టారు. టిక్కెట్లు కొన్నాక షోలు నిలిపివెయ్యడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. పాత సినిమాలకు నేటి టెక్నాలజీని జోడించి చిన్నచిన్న మార్పులు చేసి మరలా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఖుషి” సినిమాను కూడా 31 డిసెంబర్ శనివారం రోజున కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేలా రిలీజ్ చేశారు. ఈ సినిమాని అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో థియేటర్లను దద్దరిల్లుతున్నాయి.