Last Updated:

Gruhalakshmi : చేతులెత్తి క్షమాపణ చెప్తున్నా సామ్రాట్

ఈ రోజు గృహ లక్ష్మీ సిరియల్ నేటి ఏపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. అంతక ముందే తులసిని నేను నీ మాజీ భర్త అన్న విషయం సామ్రాట్ తెలియకూడదని తన దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు.

Gruhalakshmi : చేతులెత్తి క్షమాపణ చెప్తున్నా సామ్రాట్

Gruhalakshmi: ఈ రోజు గృహ లక్ష్మీ సిరియల్ నేటి ఏపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. అంతక ముందే తులసిని నేను నీ మాజీ భర్త అన్న విషయం సామ్రాట్ తెలియకూడదని తన దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. తులసి మాట మీద మనిషి కాబట్టి తన మాజీ భర్తకు ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆ మాజీ భర్త పై ఉన్న గౌరవంతో, తనను ఎంత అవమానిస్తున్న అవి అన్నీ భరించి, వాళ్ళ బాస్ ఆగడాలను ఓర్చుకొని మాట మీద నిలబడింది. నందు చేసిన తప్పుకి తులసి కాళ్ల మీద పడిన తప్పులేదు. ఒక బిజినెస్‌మేన్ గా మహాతల్లికి చేతులు జోడించి మరి నమస్కారం చేసుకుంటున్న అని రెండు చేతులతో తులసికి నమస్కరిస్తాడు. తులసి గారు చాలా మంచి మనిషి నేను ఎవరి ముందు చేతులు పెట్టి నమస్కరించలేదు అలాంటిది నేను కూడా తులసి గారికి నమస్కారం చేశాను. అందరి మందు తులసికి చేతులెత్తి క్షమాపణ చెప్తాడు. అందరి ముందు నిజ నిజాలు బయటికి రావడంతో నందు, లాస్యలు కోపంగా మొహం పెట్టి అక్కడ నుంచి ఇద్దరూ వెళ్లిపోతారు.

మన హీరో సామ్రాట్ గారు, తులసి దగ్గరకు వచ్చి తులసి కళ్ళలో కళ్లు పెట్టి తులసి గారు మీ బాస్ చేసిన ఏదో తెలియక చేసిన తప్పుల్ని క్షమించి మీరు ఆఫీస్‌కి వస్తే బావుంటుంది. నేను మీకోసం వెయ్యి కళ్ళతో వేచి చూస్తానని మళ్లీ చేతులెత్తి దండం పెట్టి సామ్రాట్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తరువాత తులసి గారు క్లోజ్ షాట్‌లో ఒక పాట వస్తుంది. ఆ సీన్ మీరు టీవిలో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. తులసి దేవుని ముందు ఉండి నిన్ను నమ్ముకున్నందుకు నేను చేయని తప్పు నుంచి బయటపడేలా చేశావు. ఇన్ని రోజులు నా మనసులో ఉన్న బాధంతా పోయింది. ఇది అంతా మీ వల్లే అంటూ దేవుని ముందు తన సంతోషాన్ని చెప్పుకుంది.

follow us

సంబంధిత వార్తలు