Last Updated:

Gruhalakshmi: అక్టోబర్ 12 ఎపిసోడ్ లో కాకమ్మ కబుర్లు చెప్పమాకంటున్న అనసూయ

ఆడదానికి ఆడదే శత్రువు..అని ఎవరు ఊరికే అనలేదు. ఇప్పుడు కూడా అదే నిజం అయ్యింది. మా మనసులో ఎలాంటి దోషం లేదు. మీ మనసులో ఆలోచనల వల్లే అని సామ్రాట్ అంటాడు.

Gruhalakshmi: అక్టోబర్ 12 ఎపిసోడ్ లో కాకమ్మ కబుర్లు చెప్పమాకంటున్న అనసూయ

Gruhalakshmi Today: నేటి గృహలక్ష్మీ సీరియల్ ఎపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. తులసి గారూ, ఇది మీ సొంత విషయం కాబట్టి, నేను ఇప్పటి వరకు నోరు మూసుకుని విన్నా. కానీ మిమ్మల్ని ఇంతలా అవమానిస్తుంటే నా నోరు విప్పక తప్పడం లేదు. మీరు నాకు అనుమతి ఇస్తే మాట్లాడతా అని అంటాడు సామ్రాట్. ఆ మాట వినగానే అనసూయ, నువ్ ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్లిపో అని గట్టిగా అంటుంది అనసూయ. ఇంతలో తులసి, ‘మీరు అనాల్సింది చెప్పాల్సింది చెప్పే వెళ్లండి సామ్రాట్ గారూ, మీరు మా ఇంట్లో భాగం కాకపోవచ్చు. కానీ నా పై పడ్డ నిందలో మీకు కూడా భాగం ఉంది సామ్రాట్ గారూ, మాట అనేవాళ్లకి లేని సంస్కారం. పడేవాళ్లకి ఎందుకు? మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో మాట్లాడండి అని పర్మిషన్ ఇస్తుంది తులసి. దొరికిందే సందు అనుకోని ఒక రేంజులో చెలరేగిపోతాడు.

ఆడదానికి ఆడదే శత్రువు అని ఎవరు ఊరికే అనలేదు. ఇప్పుడు కూడా అదే నిజం అయ్యింది. మా మనసులో ఎలాంటి దోషం లేదు. మీ మనసులో ఆలోచనల వల్లే అని సామ్రాట్ అంటాడు. ‘కాకమ్మ కబుర్లు చెప్పకు, ఆడ మగ మధ్య స్నేహం ఇక్కడ సాగదు’ అని అనసూయ కోపంగా అంటుంది. ‘ఎందుకు సాగదు, ఆడ మగ మధ్య స్నేహం మొదలైందే మన పురాణాల్లో అంటూ శ్రీక్రిష్ణుడు. ద్రౌపదిల స్నేహం గురించి చాలా చక్కగా వివరిస్తాడు. ఆ తరువాత తులసి చెలరేగిపోతుంది. బాలయ్య బాబు రేంజ్‌లో డైలాగ్ తో అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడే ఎందుకు లేస్తున్నాయ్ అని గట్టిగా అంటుంది. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి: