Last Updated:

Karthika Deepam: అక్టోబర్ 20 ఎపిసోడ్ లో దీప దగ్గరే ఉంటున్న కార్తీక్!

నన్ను వదిలేస్తావా అని మోనిత కోపంగా అంటుంది. ‘అది సరే కానీ, నన్ను ఎందుకు రమ్మంటున్నావ్.. మీ దుర్గాగారు లేరా?’అని అనుమానంగా అడుగుతాడు. కార్తీక్ మోనితని కావాలనే రెచ్చగొడుతుంటాడు.

Karthika Deepam: అక్టోబర్ 20 ఎపిసోడ్ లో దీప దగ్గరే ఉంటున్న కార్తీక్!

Karthika Deepam Today: నేటి కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. కార్తీక్ వంట పూర్తి చేసి, సరిగ్గా తినమని దీప ముందు పెట్టే సమయానికి మోనిత ఆవేశంగా అక్కడికి వచ్చేస్తుంది. ‘కార్తీక్ ఏంటిది? ఇంటికి కూడా రాకుండా ఇక్కడే ఉంటున్నావేంటీ?’ అంటూ గట్టిగా నిలదీస్తుంది. ‘ఏమో మోనితా, నీ సొంత పనుల కోసం (దుర్గతో రిలేషన్) మళ్లీ నన్ను బయటి పంపించడానికి నువ్వు కష్టపడుతూ ఉంటావ్ కదా. ఎందుకులే అని, నేనే ముందే వచ్చేశాను’ అని కార్తీక చెబుతాడు. ‘ఏంటి కార్తీక్ నువ్వు అనేది’ నన్ను వదిలేస్తావా అని మోనిత కోపంగా అంటుంది. ‘అది సరే కానీ, నన్ను ఎందుకు రమ్మంటున్నావ్. మీ దుర్గాగారు లేరా?’అని అనుమానంగా అడుగుతాడు. కార్తీక్ మోనితని కావాలనే రెచ్చగొడుతుంటాడు.

మోనిత అలా వార్నింగ్ ఇవ్వడంతో  దుర్గ కాస్త భయపడి, పరుగెత్తుకుంటూ ఈ విషయం దీపకు చెబుతాడు. ‘నేను ఇక్కడికి వచ్చిన రోజు నుంచి మోనిత నన్ను చూసి భయపడిన రోజులే ఉన్నాయి. కానీ ఇంత ధైర్యంగా మాట్లాడింది కూడా లేదు. ఆ మోనితది ఖచ్చితంగా ఏదో చేయబోతుందని తెలుస్తుంది దీపమ్మా’ అని దుర్గ చెప్పడంతో దీప కూడా కంగారుపడుతుంది. మరోవైపు, కార్తీక్ శివ దగ్గరకు వెళ్లి, ‘సౌర్యని వెతికావా?’ అంటూ ఆడగుతాడు. ‘వెతికాను, వెతుకుతూనే ఉన్నాను’ అంటూ షో చేసుకుంటూ బిల్డప్ కొడతాడు శివ. ‘సరే శివా, నాకు ఇంకో సాయం చెయ్యాలి నువ్వు’ అని కార్తీక్ అంటాడు. చెప్పండి సార్ నేను ఏం చెయ్యాలని శివ అంటాడు.

ఇదీ  చదవండి: Guppedantha Manasu: అక్టోబర్ 20 ఎపిసోడ్ లో దొంగ ఏడుపులు ఏడుస్తున్న దేవయాని !

ఇవి కూడా చదవండి: