Home / ఓటీటీ
ప్రిన్స్ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 25 నుంచి ఈ చిత్రాన్ని హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ వినిస్తుంది.
ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి, మన్మథుడు నాగార్జున నటించిన 'గాడ్ ఫాదర్' మరియు ‘ది ఘోస్ట్’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను నమోదు చేశాయి. అయితే ఈ చిత్రాలు తాజాగా ఓటీటీ వేదికగానూ అలరించనున్నాయి.
మొదటి సీజన్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలయ్య. ఇక ఈ వారం జరిగే మూడో ఎపిసోడ్‌కు క్లాస్ హీరోలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ అయిన శర్వానంద్, అడివి శేష్‌లు గెస్టులుగా వచ్చారు. ఇంకేముంది వారితో బాలయ్య బాబు ఓ రేంజ్ ఆడుకున్నాడనుకోండి.
ఈ సంవత్సరం దసరాకు విడుదలయిన చిత్రాలలో స్వాతిముత్యం చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఇది నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ కుమారుడు గణేష్ బెల్లంకొండ తొలిచిత్రం.
నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ టాక్ షో అన్‌స్టాపబుల్ రెండవ సీజన్ లో నారా చంద్ర బాబు నాయుడు, నారా లోకేష్ ముఖ్య అతిధులుగా ప్రారంభోత్సవ ఎపిసోడ్‌కి హాజరయ్యారు.
అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోను ఆహా సంస్థ రిలీజ్ చేసింది. బాలయ్య షో కు మొదటి గెస్ట్ గా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 'మీ జీవితంలో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి బావా' అని చంద్రబాబును బాలకృష్ణ అడుగగా దీనికి చంద్రబాబు చెప్పిన సమాధానానికి ప్రజలందరూ ఆశ్చర్యపోతూ చంద్రబాబు కూడా మోస్ట్ రొమాంటిక్ పర్సనే అనుకుంటారు.
అన్‌స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. మరింత రంజుగా షో ప్రారంభిద్దాం అంటున్న బాలయ్య లుక్ ఈ ట్రైలర్లో అదిరిపోయింది. అక్టోబర్ 14 నుంచి ప్రతి శుక్రవారం అన్‌స్టాపబుల్ సీజన్-2 స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా సంస్థ తెలిపింది.
ఈ ఏడాది బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రాలలో కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ ఒకటి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలను పొందారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదలవుతుందాని ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తీపికబురు చెప్పారు మూవీ మేకర్స్.
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనవసరం లేదు. కాగా ఎప్పుడెప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 2 వస్తుందా అని బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి బాలయ్య పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
‘ఉప్పెన’తో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన హీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ యువ నటుడు రంగ రంగ వైభవంగా మూవీతో సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో దసరా కానుకగా స్ట్రీమింగ్ కానుందని సమాచారం.