Youtube Top Songs: ఈ ఏడాది టాప్ సాంగ్స్ లిస్ట్ ప్రకటించిన యూట్యూబ్ – వరల్డ్ వైడ్‌గా సత్తా చాటిన తెలుగు పాట
Kurchi Madathapetti Song Records in Youtube: సూపర్ స్టార్ మహేష్ బాబు పాట సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి నుంచి మొదలు మన తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ఇప్పుడు పాటలు కూడా అదే రేంజ్‌లో అలరిస్తున్నాయి. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోవడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మన తెలుగు పాటలకు విదేశీయులు సైతం కాలు కదుపుతూ, హమ్ చేస్తూ ఎన్నో రీల్స్ వచ్చాయి.
అలా ఏకంగా మన తెలుగు పాట గ్లోబల్ రికార్డును క్రియేట్ చేసింది. 2024లో విడుదలైన టాప్ 10 సాంగ్ లిస్ట్‌ను యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో ఇండియా నుంచి ఒకే ఒక్క పాట మాత్రమే చోటు దక్కించుకుంది. అదీ కూడా మన తెలుగు సాంగ్ కావడం విశేషం. కాగా ఈ ఏడాది(2024) విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో పాటలు కూడా ఆడియన్స్‌ని బాగా అలరించాయి.
ముఖ్యంగా కుర్చి మడతపెట్టి సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్‌గా మారింది. విడుదలైన గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోయింది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్‌తో రికార్డు ఎక్కింది. ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్‌లో మారుమోగుతూనే ఉంది. వీపరీతంగా వైరల్ అయిన ఈ కుర్చీ మడత పెట్టి పాటపై నెటిజన్లు ఎన్నో రిల్స్ చేశారు. అలా అంతగా ఆడియన్స్‌ని అలరించిన ఈ పాట ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 7 పాటల జాబితాలో ఇది నిలిచింది. 527 ప్లస్ మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లో ఉంది. దీంతో 2024లో అత్యధిక వ్యూస్ సాధించిన 7 పాటల జాబితాలో కుర్చీ మడత పట్టి స్థానం దక్కించుకున్న ఏకైక ఇండియన్ సాంగ్‌గా రికార్డు క్రియేట్ చేసింది.
ఇదే విషయాన్ని యూట్యూబ్ అధికారికంగా ప్రకటిచింది వరల్డ్ వైడ్‌గా టాప్ 7 హిట్ సాంగ్స్‌ను యూట్యూబ్ ప్రకటించగా.. అందులో ఇండియా నుంచి మన తెలుగు పాట కుర్చీ మడత పెట్టి సాంగ్‌కు చోటుదక్కడం విశేషం. ఇది తెలిసి మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. కాగా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12న విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం రూ. 200 పైగా కోట్లు రాబట్టింది. ఇందులో శ్రీలీలా హీరోయిన్‌గా నటించగా.. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్‌గా కనిపించింది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, జయరాం, జగపతి బాబు, మొరళీ శర్మ, ఈశ్వరిరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.