Last Updated:

National Cinema Day: సినీ అభిమానులకు శుభవార్త… రూ. 75కే సినిమా చూడొచ్చు

రూ.75కే పెద్దపెద్ద మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూడొచ్చు అంటే మీరు నమ్ముతారా.. కానీ ఇది నిజం. అయితే ప్రతి రోజు ఆ వెసులుబాటు లేదులెండి కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే మల్టీప్లెక్స్ లో రూ. 75లకే సినిమా చూడొచ్చట. అది ఏ రోజంటే సెప్టెంబర్ 23 జాతీయ సినిమా దినోత్సవం రోజు.

National Cinema Day: సినీ అభిమానులకు శుభవార్త… రూ. 75కే సినిమా చూడొచ్చు

National Cinema Day: రూ.75కే పెద్దపెద్ద మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూడొచ్చు అంటే మీరు నమ్ముతారా.. మరీ కామెడీ చెయ్యకండి చిన్నచిన్న థియేటర్లలోనే రూ.75 టిక్కెట్ అంటే నేలటిక్కెట్లో సినిమా చూడాలి. ఇంక మల్టీ ప్లెక్స్ అయితే వందల్లోనే టికెట్టు ధర ఉంటుంది అంటారు. కానీ నేను చెప్పేది నిజం. అయితే ప్రతి రోజు ఆ వెసులుబాటు లేదులెండి కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే మల్టీప్లెక్స్ లో రూ. 75లకే సినిమా చూడొచ్చట. అది ఏ రోజంటే సెప్టెంబర్ 23 జాతీయ సినిమా దినోత్సవం రోజు.

సినిమాలకి సెప్టెంబర్ 23 స్పెషల్ డే కావడం వల్ల ది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ ఆఫర్‌ని ప్రకటించింది. దీనితో టిక్కెట్ల అధిక ధర కారణంగా ఇప్పటివరకు ఖాళీగా ఉన్న థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టాశాయి. ఇంక ఆరోజుకు సంబంధించి ఆన్ లైన్ లో టిక్కెట్లన్నీ హౌస్ ఫుల్ అని చూపిస్తున్నాయట. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లకపోవడానికి కారణం ఓటీటీలు కాదని.. టిక్కెట్ల ధరలని కామెంట్స్ పెడుతున్నారు.

దేశవ్యాప్తంగా దాదాపు 4000కి పైగా ఈ మల్టీప్లెక్స్‌ల చైన్ కింద స్క్రీన్స్ ఉన్నాయి. కరోనా తర్వాత థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలంటే చాలామంది భయపడ్డారు. కాగా ప్రేక్షకులు మళ్లీ థియేటర్స్ కి రావడాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి జాతీయ సినిమా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఈ దినోత్సవాన్ని సెప్టెంబరు 16న నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. దాని గురించి ప్రకటన కూడా చేశారు. కానీ.. పలువురి అభ్యర్థన మేరకు ఎమ్‌ఏఐ జాతీయ సినిమా దినోత్సవాన్ని సెప్టెంబర్ 23కి మార్పు చేసింది.

ఇదీ చదవండి: Last Film Show Oscar Entry: “ఆర్ఆర్ఆర్” కు భారీ షాక్… “ఆస్కార్” రేసులో గుజరాతీ “లాస్ట్ ఫిల్మ్ షో”

ఇవి కూడా చదవండి: