Last Updated:

Vastu Tips : ఇంటి మెయిన్ గేటు ఎదురు ఈ వస్తువులు ఉంటే ఆ దోషాలకు కారణం కాక తప్పదు..!

హిందూ మత ఆచారాల ప్రకారం వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ఉన్న బిజీ ప్రపంచంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వాస్తు దోషాలకు కారణం అవుతాయని చెబుతున్నారు. అయితే ఆ తప్పిదాలు జరగకుండా ఉండాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

Vastu Tips : ఇంటి మెయిన్ గేటు ఎదురు ఈ వస్తువులు ఉంటే ఆ దోషాలకు కారణం కాక తప్పదు..!

Vastu Tips : హిందూ మత ఆచారాల ప్రకారం వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ఉన్న బిజీ ప్రపంచంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వాస్తు దోషాలకు కారణం అవుతాయని చెబుతున్నారు. అయితే ఆ తప్పిదాలు జరగకుండా ఉండాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో లేదా ఇంటి వెలుపల ఉండే వస్తువులు కుటుంబ జీవితంపై ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

ఇంటి గేటు ఎదురు ఉంచకూడని వస్తువులు ఏంటి అంటే (Vastu Tips)..?

చెత్తడబ్బా..

సాధారణంగా మన ఇంట్లో చెత్తను ఊడ్చి మెయిన్ డోర్ దగ్గర లేదా తలుపుల వెనుక పెడుతూ చెత్తడబ్బా లేదా కవర్లో ఉంచుతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదట. ఎందుకంటే ప్రధాన ద్వారం దగ్గర ఉండే చెత్త వల్ల మీకు ఆర్థిక పరమైన సమస్యలు కూడా పెరుగుతాయని తెలుపుతున్నారు. ప్రధాన ద్వారం వద్ద చెత్త ఉంటే నిల్వ ఉంచకుండా పారవేయాలని చెబుతున్నారు.

చెట్లు, మొక్కలు ఉండకూడదు..

వాస్తు ప్రకారం, మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దగ్గర చెట్లు, మొక్కలు ఉండకూడదు. ఎందుకంటే ఇది మీ పురోగతిని అడ్డుకుంటుంది. దీని వల్ల మీ ఇంట్లోని పిల్లలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. కాబట్టి ఇంటి నిర్మాణ సమయంలో లేదా ఇల్లు కొనేటప్పుడు ఇంటి మెయిన్ గేటు దగ్గర చెట్లు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాస్తు ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెట్టు ఉంటే బాల దోషం వస్తుంది.

బురద..

మీ ఇంటి మెయిన్ గేటు దగ్గర ఎల్లప్పుడూ నీరు లేదా బురద అనేది ఉండకూడదు. ఇలా ఉంటే వాస్తు దోషం మీ ఇంటిపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ సమయంలో ఆర్థిక పరంగా నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి మీ ప్రధాన ద్వారం ఎలాంటి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

అలానే శుభ్రంగా ఉండే ఇంటిలోనే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. కావున ఈ వాస్తు అంశాలను ఫాలో అయ్యి ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని శాస్త్ర నిపుణులు దీవిస్తున్నారు.