Last Updated:

Income Tax: లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై ట్యాక్స్ మినహాయింపు పెంపు

ప్రైవేటు రంగుల్లో ఉద్యోగులకు సంబంధించి లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ప్రైవేటు ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు రూ. 3 లక్షలుగా ఉంది. ఈ పరిమితిని 2002 లో నిర్ణయించారు.

Income Tax: లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై ట్యాక్స్ మినహాయింపు పెంపు

Income Tax: ప్రైవేటు రంగుల్లో ఉద్యోగులకు సంబంధించి లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య ప్రకటన చేసింది. ఇంతకుముందు బడ్జెట్ లో ప్రకటించిన విధంగానే ప్రైవేట్ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత చేసుకునే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు మొత్తాన్ని రూ. 25 లక్షలకు పెంచింది. ఇప్పటి వరకు ప్రైవేటు ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు రూ. 3 లక్షలుగా ఉంది. ఈ పరిమితిని 2002 లో నిర్ణయించారు.

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

సెక్షన్ 10(10AA)(2)ప్రకారం ఆదాయపు పన్ను నుంచి మినహాయించిన మొత్తం రూ. 25 లక్షలకు మించరాదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT)ఒక ప్రకటనలో పేర్కొంది. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పొడిగించిన పన్ను మినహాయింపు పరిమితి 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.

ఓ ప్రవేటు ఉద్యోగి ఆర్జించే మొత్తం రూ. 25 లక్షలకు మించకుండా ఉంటే అది పన్ను రహితం అని సీబీడీటీ వివరించింది. 2023 బడ్జెట్ లోని ప్రతిపాదనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఉ‍ద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందే లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ. 25 లక్షలకు పెంచిందని.. 2023 ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని సీబీడీటీ తెలిపింది.