Home /Author M Rama Swamy
Scam on US President Donald Trump Name in Karnataka: టెక్నాలజీని వాడుకొని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో కర్ణాటకలో సుమారు 150 మందిని నమ్మించి రూ.కోటికిపైగా దోచుకున్నారు. సైబర్ మోసగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించి ట్రంప్ మాట్లాడతున్నట్లు వీడియోలను సృష్టించారు. తాను ట్రంప్ పేరుతో యాప్‌ను రూపొందించానని, పెట్టుబడులు పెట్టాలని తద్వారా ఎక్కువ లాభాలు వస్తాయని […]
TG ECET 2025 Results Release at 12:30 PM Today: రాష్ట్రంలోని కళాశాల్లో 2025–2026 విద్యాసంవత్సరానికి బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఈసెట్ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కాబోతున్నాయి. ఈసెట్ కన్వీనర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ […]
AP CM Chandrababu Naidu’s Housewarming Ceremony: ఏపీ సీఎం చంద్రబాబు గృహప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు గృహప్రవేశం చేశారు. ఇవాళ తెల్లవారుజాము 4:30 గంటలకు గృహప్రవేశ పూజా కార్యక్రమం నిర్వహించారు. సీఎం కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఉదయం 10 గంటలకు టీడీపీ నాయకులు, ప్రజలను చంద్రబాబు దంపతులు కలువనున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు […]
Constable dies in Road Accident: పెట్రోలింగ్ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో పోలీసు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద జరిగింది. శనివారం అర్ధరాత్రి షాపూర్ హైవేపై ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు మార్గంలో వెళ్లున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వేగంగా దూసుకొచ్చిన లారీ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. వాహనం వద్ద ఉన్న విజయ్ కుమార్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. […]
Tirumala Tirupati Devasthanam: వేసవి సెలవులతోపాటు, వీకెండ్ కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థల సెలవులు దగ్గర పడుతుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున తిరుమల చేరుకుంటున్నారు. మూడు రోజులుగా తిరుపతి కొండపై భక్తులు కిటకిటలాడుతున్నారు. శనివారం ఉదయం నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఇవాళ కూడా రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో ఉన్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ నిండి బయట క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం […]
Heavy rain in Delhi: ఢిల్లీలో వర్షం దంచికొట్టింది. ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రహదారులు వరద నీటితో నిండిపోయాయి. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. 100కు పైగా ఫైట్లు రాకపోకలు నిలిచిపోయాయి. మరో 25కి పైగా దారి మళ్లించారు. ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయం అడ్వైజరీ జారీచేసింది. ప్రతికూల వాతారణంతో విమానాల […]
DC won the Match against PKBS in IPL 2025: ఐపీఎల్లో ప్లేఆఫ్స్ ఖాయం చేసుకున్న జట్లకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆర్సీసీబీకి ఎస్ఆర్హెచ్ షాక్ ఇచ్చింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ నీళ్లు గుమ్మరించింది. ఢిల్లీపై గెలిచి అగ్రస్థానంలోకి వెళ్లాలని అనుకున్న పంజాబ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌పై సూపర్ విక్టరీ సాధించింది. పంజాబ్ కింగ్స్ […]
Advisor responds to news of Yunus’ Resignation: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామాకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా ఆయన మంత్రివర్గ సలహాదారు వహీదుద్దీన్ మహమూద్ స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలు అని కొట్టిపడేశారు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ కొనసాగుతారని స్పష్టం చేశారు. బంగ్లాలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులకు భయపడి రాజీనామా చేస్తానని చెప్పలేదన్నారు. యూనస్ సర్కారుకు కేటాయించిన బాధ్యతలు నిర్వర్తించడంలో అనేక […]
Miss England Milla Magee withdraws from competition: హైదరాబాద్‌లో జరుగుతోన్న 72వ ప్రపంచ సుందరీమణుల పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ -2025 మిల్లా మాగీ వైదొలిగింది. దీంతో మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటీష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్, సీఈవో జూలియా మోర్లే స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ మిస్ ఇంగ్లాండ్ మాగీ చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ నెల […]
Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బషీర్‌బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, నాంపల్లి, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, జియాగూడ, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, సనత్‌నగర్, శేరిలింగంపల్లి, మియాపూర్, మదీనగూడ, చందానగర్‌లో భారీగా వర్షం కురుస్తున్నది. లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలితోపాటు సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, […]