TG ECET 2025 Results: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. తెలంగాణ ఈసెట్ ఫలితాలు నేడు
TG ECET 2025 Results Release at 12:30 PM Today: రాష్ట్రంలోని కళాశాల్లో 2025–2026 విద్యాసంవత్సరానికి బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఈసెట్ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కాబోతున్నాయి. ఈసెట్ కన్వీనర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం. కుమార్ హాజరుకానున్నారు.
పరీక్ష ఫలితాల అనంతరం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ వివరాలు నమోదు చేసి ర్యాంకు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం పూర్తి చేసిన అభ్యర్థులు బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందగలరు. ఈ ఏడాది కూడా పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ 2024 పోస్టులకు సంబంధించి ఈ నెల 5వ తేదీన నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. నియామక ప్రక్రియలో చివరి దశగా సైకోమెట్రిక్ టెస్ట్ ఈ నెల 31న నిర్వహించనుండగా, ఇంటర్వ్యూలు జూన్ 5వ తేదీ నుంచి 9 వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచుల్లో 600 పీవో పోస్టుల భర్తీకి ప్రక్రియను చేపట్టారు.