Home /Author Narasimharao Chaluvadi
నేటి సినిమా రంగంలో అశ్లీలత పెరిగి కుటుంబసమేతంగా సినిమాలు చూడలేని పరిస్ధితి ఏర్పడింది. దీంతోపాటు ఆధ్యాత్మిక అంశాలకు సైతం అశ్లీలత జోడించి డబ్బులు సంపాదించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనను నిరసిస్తూ హైదరాబాదు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది.
భారత్ జోడో యాత్ర హైదరాబాదు నగరంలో ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్ర సాగే క్రమంలో లింగంపల్లి చౌరస్తా నుండి ముత్తంగి వరకు భారీ కాన్వాయ్ ఓవైపుగా, మరో వైపు సాధారణ వాహనాలను దారి మళ్లించారు. వన్ వేలోనే రెండు వైపులా వాహనాలు వెళ్లే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు.
భార్య బాధితుల్లో అతను ఒకరు. చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉండడంతో అర్ధాంగి నుండి ఎదురైన మానసిక వేదింపులు తట్టుకోలేక రక్షించాలంటూ ఏకంగా ప్రధానమంత్రికే ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాను ఈ విధంగా కూడా వాడేస్తున్న ఆ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకొనింది.
నగరంలోని లిబర్టీ చౌరస్తా వద్ద పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనం పై నగదును తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఓ మంత్రే స్వయంగా మద్యం పోశారు. మరోవైపు ప్రధాన పార్టీలు నోట్ల కట్టలను నీళ్లలా పంచారు. దీంతో ఖరీదైన ఉప ఎన్నికగా తెలంగాణాలో మునుగోడు రికార్డుకెక్కింది.
ప్రముఖ మహిళా సాధికారికత కార్యకర్త, గాంధేయవాది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు ఎలబెన్ భట్ (89) కన్నుమూశారు. స్వల్ప అస్వస్థతతో గుజరాత్లోని అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బెట్టింగ్ ముఠాల తీరు. రేపటిదినం మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నెల 6న ఓట్ల లెక్కింపు సాగనుంది. ఈ క్రమంలో పోలింగ్ రౌండ్లను ఓవర్ లెక్కన బుకీలు పంచుకొన్నారు.
రేపటిదినం జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు భారీ పోలీసు బందోబస్తును కల్పించిన్నట్లు రాచకొండ సీపి మహేశ్ భగవత్ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల నడుమ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తక్కువ మంది విద్యార్ధులు చదువుతున్న పీజీ కోర్సులను రద్దు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది.
రష్యన్ లగ్జరీ బ్రాండ్ కేవియర్ యాపిల్ మొబైల్ దిగ్గజ సంస్ద మరో అద్భుత ఫోన్ తయారీకి సిద్ధమైంది. కార్ రేస్ అభిమానుల కోసం ప్రత్యేక ఆకర్షణీయ మోడల్ లో ఐ ఫోన్ ను తయారు చేయనున్నారు.