జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం తినాలో తెలుసా
Do you know what to eat to improve memory? జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం తినాలో తెలుసా

గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడానికి చాలా ముఖ్యమైనది.

ఆకుపచ్చ కూరగాయల్లో మెదడు కణజాల పెరుగుదలను ప్రోత్సహించే సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తి పెంచడానికి తోడ్పడుతుంది.

వాల్‌నట్‌లు, బాదం మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించుతాయి

సాల్మన్, సార్డినెస్ వంటి చేపల్లో ఉండే ఒమేగా3ఫ్యాటీ ఆమ్లాలు మెదడు కణాల పెరుగుదలకు తోడ్పడుతాయి

అవిసె గింజలు, చియా గింజలు విటమిన్ ఇ అధికంగా ఉండి మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతాయి

గుడ్లలో బి విటమిన్లు, కోలిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటాయి ఇవి కూడా జ్ఞాపకశక్తికి తోడ్పడుతాయి

డార్క్ చాక్లెట్‌లో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడతాయి.

డార్క్ చాక్లెట్ తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది

బ్లూ బెర్రీస్ తినడం వల్ల అల్జీమర్స్ ప్రభావాన్ని తగ్గించవచ్చు
