Home /Author anantharao b
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వివిధ హోదాల్లో సెక్రెటరీలుగా పనిచేసిన దాదాపు 10 మంది ఐఏఎస్ లు ఈరోజు విచారణకు హాజరయ్యారు . కాగా వీరి హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, అందుకు గల కారణాలను కమిషన్ అడిగి తెలుసుకుంది.
తెలంగాణలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షలు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వల్పకాలిక పంట రుణాలను మాఫీ చేయనున్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. రుణమాఫీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి చేశారు.
హైదరాబాద్‌లో ఎస్ఓటీ రాజేంద్రనగర్, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈసందర్బంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నైజీరియన్లతో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బోనాల పండుగ చెక్కుల పంపిణీ సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ ను ఉల్లంఘించారంటూ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. మహేశ్వరంలోని ఆర్కేపురం డిజవిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలకు ఆలయ కమిటీలకు చెక్కుల పంపిణీ సందర్బంగా సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే ఒక రికార్డు నెలకొల్పామని.. జనసేన అదినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లడారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే, చైనీస్ రిటైలర్లు మరియు ఆన్లైన్ దుకాణాలు ట్రంప్ ఫోటోలతో కూడిన టీ-షర్టుల అమ్మకాలను ప్రారంభించాయి.
సెంట్రల్ గాజాలోని నుసిరత్ క్యాంప్‌లో శరణార్దుల శిబిరంగా నిర్వహించబడుతున్న పాఠశాలపై ఇజ్రాయెల్ మిలటరీ చేసిన దాడుల్లో 15 మంది మరణించినట్లు గాజా లోని సివిల్ డిఫెన్స్ ఏజన్సీ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ డెయిఫ్ లక్ష్యంగా జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో దక్షిణ గాజాలో శనివారం కనీసం 71 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఖాన్ యూనిస్ సమీపంలోని భవనంలో డీఫ్ దాక్కున్నట్లు వచ్చిన నివేదికల తర్వాత డెయిఫ్ మరణించాడా లేదా అన్నది అస్పష్టంగా ఉందని భద్రతా అధికారి ఒకరు తెలిపారు.
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలలో జరిగిన 13 అసెంబ్లీ స్దానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి10 సీట్లు, బీజేపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 4, హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ లోని ఒక్కో స్దానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.