Last Updated:

Telangana: ఒకప్పుడు నో ఎంట్రీ.. ఇప్పుడు వెల్‌కమ్ తెలంగాణలో చంద్రబాబుపై కేసీఆర్ వ్యూహం ఎందుకు మారింది?

తెలంగాణలో టిడిపి అధినేత చంద్రబాబు రీ ఎంట్రీ పై బిఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయా.. చంద్రబాబు రాకపై బిఆర్ఎస్ ఉద్యమ నేతలు ఎదురుదాడి చేస్తోంటే.. పాత టిడిపి నేతలు సాఫ్ట్ కార్నర్ తో వున్నారా..

Telangana: ఒకప్పుడు నో ఎంట్రీ.. ఇప్పుడు వెల్‌కమ్ తెలంగాణలో చంద్రబాబుపై కేసీఆర్ వ్యూహం ఎందుకు మారింది?

Telangana: తెలంగాణలో టిడిపి అధినేత చంద్రబాబు రీ ఎంట్రీ పై బిఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయా.. చంద్రబాబు రాకపై బిఆర్ఎస్ ఉద్యమ నేతలు ఎదురుదాడి చేస్తోంటే.. పాత టిడిపి నేతలు సాఫ్ట్ కార్నర్ తో వున్నారా.. బిఆర్ఎస్ లో ఉంటూనే టీడీపీని ఆప్షన్ గా పెట్టుకున్నారా.. ఇది కేసీఆర్ వ్యూహమా.. భవిష్యత్ లో టీడీపీతో బిఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందా.. అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూసేయ్యండి.

chandrababu

chandrababu

చంద్రబాబు ఫోకస్ ఆన్ తెలంగాణ 

తెలంగాణలో పొలిటికల్ స్పీడ్ ను పెంచారు చంద్రబాబు. దీంతో అధికార బిఆర్ఎస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఉద్యమకాలం నుంచి ఉన్న నేతలు చంద్రబాబు యాక్టివ్ కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంటే.. పాత టీడీపీ నేతలు మాత్రం సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఇటీవల ఖమ్మంలో టిడిపి నిర్వహించిన బహిరంగ సభ తర్వాత బిఆర్ఎస్ వైఖరిలో మార్పు వచ్చింది. చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టడంతో ఇప్పటి వరకు ఇనాక్టివ్ గా ఉన్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో టీడీపీకి తెలంగాణలో అవకాశం వచ్చిందనే అభిప్రాయం సెటిలర్లలో వ్యక్తం అవుతోంది. అందుకు నిదర్శనంగా ఖమ్మం సభను ఉదాహరణగా తీసుకోవచ్చనే వాదన వినిపిస్తోంది.

chandrababu and KCR

chandrababu and KCR

తెలంగాణలో 2014 టీడీపీ నుంచి టీడీపీ డౌన్ 

తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలో వచ్చాక క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న టిడిపిని దెబ్బకొట్టింది. 2014 లో గెలిచిన టీడీపీ 15 మంది ఎమ్మెల్యేల్లో 14 మందితో పాటుగా ఒక లోక్ సభ సభ్యుడిని బిఆర్ఎస్ లో చేర్చుకుంది. ఓటుకు నోటు కేసును బూచీగా చూపించి టిడిపిని తెలంగాణలో బలహీనపర్చింది. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు విధిలేని పరిస్థితుల్లో నాడు బిఆర్ఎస్ లో చేరారు. అయినా ఏనాడు చంద్రబాబును పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు.

వ్యూహం మార్చిన కేసీఆర్.. టీడీపీపై సాఫ్ట్ కార్నర్

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. ఒక వైపు బీజేపీ అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తూ బిఆర్ఎస్ కు పక్కలో బల్లెంలా మారింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు ఉంటుందనే చర్చ ఊపందుకుంది. ఇదే జరిగితే ఆ పరిణామాలు బిఆర్ఎస్ కు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మంతో పాటు సెటిలర్ల ప్రభావం ఉన్న జిల్లాల్లో బిఆర్ఎస్ ఓట్లకు భారీగా గండిపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో కెసిఆర్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీపై సాఫ్ట్ కార్నర్ తోనే ముందుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఖమ్మంలో టీడీపీ సభ తర్వాత మంత్రులు హారీష్ రావు, పువ్వాడ అజయ్ తప్ప మిగతా నేతలు ఎవరూ స్పందించలేదు. టిడిపి నుంచి బిఆర్ఎస్ లోకి వచ్చిన నేతలు సైతం సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ మరింతగా బలపడితే టీడీపీని అక్కున చేర్చుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా బీజేపీ, కాంగ్రెస్ వైపు సెటిలర్ల ఓట్లు బదిలీ కాకుండా అడ్డుకోవచ్చనే అభిప్రాయంతో గులాబీ బాస్ వున్నట్లు సమాచారం.

chandrababu and KCR

chandrababu and KCR

బిఆర్ఎస్ గా జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కేసీఆర్.. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా నష్టం ఏమిలేదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఏం జరుగనుందో వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: నువ్వు పెద్ద మగోడివా? పవన్ కళ్యాణ్‌పై అంబటి రాంబాబు ఫైర్

ఇవి కూడా చదవండి: