Indian Army: వలస గతాన్ని తుడిచిపెట్టే దిశగా భారత సైన్యం
బ్రిటీష్ వలస రాజ్యాల గతాన్ని ఆర్మీ తుడిచేయనుంది. భారతీయ వారసత్వానికి దేశ సైనిక వ్యవస్ధకు సరికొత్త బీజం వేయనుంది. భారతీయ వారసత్వానికి దేశ సైనిక వ్యవస్ధకు సరికొత్త బీజం వేయనుంది. భారతదేశ ప్రజలు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న తరుణంలో నేడు ఆచరిస్తున్న ఆర్మీ బ్రిటీష్ వలస గతానికి చరమగీతం పాడనున్నారు.
New Delhi: బ్రిటీష్ వలస రాజ్యాల గతాన్ని ఆర్మీ తుడిచేయనుంది. భారతీయ వారసత్వానికి దేశ సైనిక వ్యవస్ధకు సరికొత్త బీజం వేయనుంది. భారతదేశ ప్రజలు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న తరుణంలో నేడు ఆచరిస్తున్న ఆర్మీ బ్రిటీష్ వలస గతానికి చరమగీతం పాడనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే నేతృత్వంలో సాగుతున్న నూతన మార్పుల్లో ప్రధానంగా సైనిక యూనిట్లు, రెజిమెంట్లు, యూనిఫాంల పేర్లలో తగిన మార్పులు తీసుకురానున్నారు.
భారత దేశం ఆర్మీ చట్టంలో ప్రస్తుతం వలస కాలం నాటి ఆచారాలు, సంప్రదాయాలు, ఆర్మీ యూనిఫాంలు, లెక్కలు, నిబంధనలు, నియమకాలు, విధానాలు, యూనిట్ పేర్లలో ఆంగ్లేయులకు సంబంధించిన పేర్లు అధికంగా ఉన్నాయి. వాటి స్థానంలో భారతదేశం ప్రాముఖ్యతను తెలియచేసేలా భర్తీ చేసే కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. దీనితోపాటుగా సైన్యం, యుద్ధంలో పాల్గొన్న వారికి అందచేసే గౌరవాలు, పేర్లు, యూనిట్లోని చిహ్నాలు, ఆర్మీ అధికారి రోజువారీ సంప్రదాయాలు, ఆచారాలను కూడా సమీక్షించాలని భావిస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల సెప్టెంబర్ 2న కొత్త నౌకాదళ జెండాను ఆవిష్కరించిన కొద్ది రోజుల తర్వాత ఈ చొరవ తీసుకొన్నట్లు తెలుస్తుంది. సెయింట్ జార్జ్ అనే పేరు రెడ్ క్రాస్ ఉనికిలో లేదని గుర్తించారు. జాతీయతను సూచించడానికి నౌకాదళ నౌకల పై నావికా దళం ప్రదర్శిస్తుంటారు. ప్రధాన మంత్రి ఆనాడు మాట్లాడుతూ, భారత నావికాదళానికి సెప్టెంబర్ 2 నుండి కొత్త జెండా వచ్చిందన్నారు. ఇప్పటి వరకు, భారత నౌకాదళం యొక్క జెండా పై బానిసత్వం యొక్క గుర్తింపు ఉందని, నేటి నుండి ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో కొత్త నేవీ జెండా సముద్రంలో, ఆకాశంలో ఎగురుతుందని కొద్ది రోజుల కిందట తెలిపి వున్నారు.
ఆ దిశగా ఇండియన్ ఆర్మీలోని విదేశీ పేర్ల స్థానంలో దేశ ప్రాముఖ్యతను సూచించే విధంగా తగిన పేర్లను ఖరారు చేయనున్నారు. భారత దేశ పౌరులకు 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా నూతన సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వ శ్రీకారం చుట్టడం ఓ శుభ పరిణామంగా భావించాలి.