Viral Video: ఆ బాలిక ఆర్ట్ కు ఆనంద్ మహేంద్ర ఫిదా.. ఒకే సమయంలో 15 చిత్రాలు
ఒకరు ఒక సమయానికి ఒక ఆర్ట్ గీస్తారు. మహా అద్భుత ప్రతిభావంతులు అయితే రెండు చేతులూ, రెండు కాళ్లు, నోరు ఉపయోగించి పెయింటింగ్ వెయ్యడం చూసి ఉంటాం. కానీ ఒంటి చేత్తో ఒకేసారి ఒకే సమయంలో 15 చిత్రాలను గియ్యడం మీరెక్కడైనా చూశారా.. చూడలేదు కదా. అయితే ఇప్పుడు ఈ వీడియో చూసెయ్యండి.
Anand Mahindra: ఒకరు ఒక సమయానికి ఒక ఆర్ట్ గీస్తారు మహా అద్భుత ప్రతిభావంతులు అయితే రెండు చేతులూ రెండు కాళ్లు నోరు ఉపయోగించి పెయింటింగ్ వెయ్యడం చూసి ఉంటాం. కానీ ఒంటి చేత్తో ఒకేసారి ఒకే సమయంలో 15 చిత్రాలను గియ్యడం మీరెక్కడైనా చూశారా.. చూడలేదు కదా. అయితే ఇప్పుడు ఈ వీడియో చూసెయ్యండి.
ఓ బాలిక అద్భుత ప్రతిభ చూసి భారతదేశ ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహింద్ర అబ్బురపోయాడు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఆ బాలిక వీడియోను ఆయన తన ట్విట్టర్లో షేర్ చేశారు. కాగా ఆ బాలిక ఒకే సమయంలో ఒంటి చేత్తో 15 చిత్రపటాలను గీసి ఆమె అరుదైన రికార్డు సాధించింది. ఈ బాలిక ఫీట్ కు ఆనంద్ మహింద్రను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆయన ఆన్లైన్లో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఈ వైరల్ వీడియో ప్రారంభంలో బాలిక తన మాస్టర్‌పీస్ ఆర్ట్ పక్కన నిలుచుని ఉండటం కనిపించింది. తదనంతరం ఆమె కొన్ని కర్రలను ఒకటిగా పేర్చి తర్వాత ఆ స్టిక్స్ కు బ్లూ, బ్లాక్, రెడ్ పెన్నులను అమర్చింది. అటుపై కాన్వాస్ పీస్‌ను 15 భాగాలుగా వేరుచేసి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల పెయింటింగ్స్ వేయడం కనిపిస్తుంది. దీనిని చూసిన ఆనంద్ మహేంద్ర
అసలు ఇదెలా సాధ్యం..? ఆమె నైపుణ్యం కలిగిన ఆర్టిస్ట్..అయినా ఒకేసారి 15 చిత్రపటాలను వేయడం మాత్రం అద్భుతమని పేర్కొన్నారు. ఇది నిజమేనని అక్కడున్న వారెవరైనా నిర్ధారిస్తే ఆ బాలికకు స్కాలర్‌షిప్‌తో పాటు అవసరమైన సాయం అందిస్తా అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు ఆనంద్ మహేంద్ర. కాగా ఈ వీడియో చూసి నెటిజన్లను ఔరా అంటున్నారు. బాలిక నైపుణంపై పలువురు యూజర్లు ప్రశంసలు గుప్పించారు. ఇది అసాధారణ నైపుణ్యమని కొందరు మెచ్చుకోగా, బాలిక టాలెంట్ నమ్మలేకపోతున్నామని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
How is this even possible?? Clearly she’s a talented artist. But to paint 15 portraits at once is more than art—it’s a miracle! Anyone located near her who can confirm this feat? If valid, she must be encouraged & I’d be pleased to provide a scholarship & other forms of support. pic.twitter.com/5fha3TneJi
— anand mahindra (@anandmahindra) October 27, 2022
ఇదీ చదవండి: సింక్ తో సింబాలిక్ గా ట్విట్టర్ ఆఫీస్ కు ఎంట్రీ ఇచ్చిన మస్క్.. వీడియో వైరల్