Karthika Deepam: ఎట్టకేలకు వంటలక్క దర్శనం కలిగింది!
ఎట్టకేలకు వంటలక్క దర్శనం ఇచ్చింది. వంటలక్క ఫ్యాన్స్ మొత్తానికి ఫలించింది. వంటలక్క కోసం కోట్లాది మంది ఎదురు చూశారు . కార్తీక దీపం సీరియల్ అభిమానులు వంటలక్క ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని ఎదురుచూశారు. కార్తీకదీపం సీరియల్‌లోకి వంటలక్క
Karthika Deepam: ఎట్టకేలకు వంటలక్క దర్శనం ఇచ్చింది. వంటలక్క ఫ్యాన్స్ మొత్తానికి ఫలించింది. వంటలక్క కోసం కోట్లాది మంది ఎదురు చూశారు . కార్తీక దీపం సీరియల్ అభిమానులు వంటలక్క ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని ఎదురుచూశారు. కార్తీకదీపం సీరియల్‌లోకి వంటలక్క మీ అందరి కోసం మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. ఇక సీరియల్ రేటింగ్స్ ఎక్కడా తగ్గకుండా దూసుకెళ్తుంది. గతంలో కార్తిక్ ఫ్యామిలీ కార్తీక్, దీప, హిమ, సౌర్యలు కేరళలోని తిరువనంతపురం వెళ్లినప్పుడు అక్కడ హిమ డ్రైవింగ్ పిచ్చి కారు డ్రైవ్ చేసింది. ఆ సమయంలో కారులో దీప కూడా ఉంటుంది. కారు అదుపు తప్పి లోయవైపు వెళ్ళిపోతుంది. హిమ, దీపలను కాపాడటానికి కార్తీక్ కూడా కారు ఎక్కుతాడు. ముగ్గురు కారులో ఉండగానే సౌర్య కళ్లముందే ఆ కారు బ్లాస్ట్ అయిపోతుంది. హిమ ఒక్కటే బతికి తిరిగిరావడం, హిమ కారణంగానే తన తల్లిదండ్రులు చనిపోయారని సౌర్య. హిమ మీద పగ బట్టినట్టు సౌర్య ప్రవర్తిస్తుంది. అది అంతా ఇప్పుడు నడుస్తున్న కథ. అయితే దీప బతికే ఉందని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ప్రేమీ విశ్వనాథ్(వంటలక్క) మీడియాలో వచ్చేస్తున్నా అంటూ దీపలా రెడీ అయి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వెంటనే స్టార్ మా ప్రోమో వీడియోను విడుదల చేసారు. ఆ ప్రోమో బాగా వైరల్‌గా అయింది.
ఇక ఇప్పుడు వంటలక్క రావడంతో పాటు డాక్టర్ బాబు కూడా కనిపించాడు. కార్తిక్ ఫ్యామిలీ మళ్ళీ వస్తున్నారంటూ గత కొన్నిరోజుల క్రితమే మోనిత ( శోభ ) కూడా వస్తున్నా అంటూ యూట్యూబులో వీడియోలు విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటి ప్రోమో అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత వస్తున్నారంటే కచ్చితంగా చిన్న సౌర్య , చిన్న హిమ కూడా వస్తారనడానికి మొన్నటి ఎపిసోడులో తెలిసింది. సౌర్య గతంలోకి వెళ్లే సీన్‌తో చిన్న సౌర్యని అభిమానులకు చూపించారు. డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర. గతంలో కార్తిక్, దీపలను ఎవరు కాపాడారు. గతంలో వాళ్ళని ఎవరు రక్షించారు వంటి ఎన్నో కొత్త కథతో కార్తీకదీపం సిద్ధం అయింది. కార్తీక దీపం మళ్లీ మంచి రేటింగ్స్ తో దూసుకెళ్లనుంది.
పోయిన వారంలో కార్తీక దీపం ప్రోమో చూసిన వంటలక్క ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకున్నారు. వంటలక్కకు స్వాగతం పలుకుతున్నారు. అలా ప్రోమో వదలగానే సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా అయింది. వంటలక్క ఎంట్రీ ప్రోమో వీడియోకు వ్యూస్ కూడా బాగా వచ్చాయి. వంటలక్క కనిపించింది కాబట్టి, డాక్టర్ బాబు ఎంట్రీ కూడా కూడా ఇచ్చేసారు.