Home / తాజా వార్తలు
తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి ఇప్పుడు నిజమైన ఊటిగా మారింది. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎక్కడ చూసినా జలపాతాలు జాలువారుతున్నాయి. ఈ సుందర దృశ్యాలను చూసి పర్యాటకులే కాదు స్ధానికులు కూడా మైమరిచిపోతూ ఎంజాయ్ చేస్తున్నారు.
శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తన రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా శుక్రవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకారం, ఈ సంవత్సరం రెండు దేశాలు దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు జరుపుకుంటున్నాయి. భారతదేశం-శ్రీలంక దీర్ఘకాల సంబంధాలను సమీక్షించడానికి మరియు మరింత ఊపందుకోవడానికి ఈ సమావేశం ఒక అవకాశాన్ని సూచిస్తుంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ చార్జిషీట్లో ప్రస్తావించిన కీలక అంశాలు బయటికి వచ్చాయి. హత్యకు కుట్ర చేశారని, ఘటనాస్థలంలో ఆధారాలు చెరిపేశారని సీబీఐ తెలిపింది. ఫొటోలు, గూగుల్ టేక్ అవుట్, లొకేషన్ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్యకు అవినాష్, భాస్కర్‌రెడ్డి కుట్ర చేశారని సీబీఐ నిర్థారించింది.
మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు చూపుతున్న వీడియోపై దేశం ఆగ్రహంతో ఊగిపోతుండగా, ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ మెయిటీ ఇంటిని గురువారం కొంతమంది వ్యక్తులు తగులబెట్టారు.మే 3న ఈశాన్య రాష్ట్రంలో జాతి హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్పోక్పి జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన ఈ సంఘటన రెండు నెలల తర్వాత బయటపడింది.
మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విధించిన రెండేళ్ల జైలు శిక్ష కేసులో సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 4వ తేదీకి వాయిదా పడింది. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.దీనిపై విచారించిన సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేసినా రాహుల్‌కు ఊరట దక్కలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు
Bank Notice To Mla Sridhar Reddy: ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆస్తులు వేలానికి సిద్ధమయ్యాయి. ఎమ్మెల్యే ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన జారీచేసింది.
Weather Alert: ఒకవైపు అల్పపీడనం, ఇంకోవైపు నైరుతి మేఘాలు, మరోవైపు ఉపరితల ఆవర్తనం.. ఈ మూడు కలిసి తెలుగు రాష్ట్రాలపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ఎడతెరపిలేని జోరువానతో తెలుగు రాష్ట్రాలు తడిచి ముద్దయ్యాయి.
Project-K: ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ప్రాజెక్ట్-కే టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ వచ్చేశాయ్. అమెరికాలో జరుగుతోన్న శాన్‌డియాగో కామిక్ కాన్ ఫెస్టివల్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
Horoscope: జ్యోతిష్య శాస్త్రాన్ని అనేక మంది ప్రజలు విశ్వసిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని లెక్కించడంతో పాటు వాటికి పరిహారాలు కూడా తెలియజేస్తారు జ్యోతిష్య పండితులు. మరి నేడు 21 జూలై 2023న 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Telugu Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జూలై 21వ తేదీన శుభ అశుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.