Home / తెలంగాణ
Man Died in Aleru MLA Beerla Ilaiah’s Home: ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలోని పెంట హౌస్‌లో అద్దెకు ఉంటున్నాడు. తాను ఉంటున్న గదిలోనే రవి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల రవిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. రెండురోజులుగా మృతుడి సొంత గ్రామం సైదాపురంలోనే ఉన్న అతడు ఎమ్మెల్యే నివాసంలో ఉరేసుకొని […]
Balmuri Venkat Filed a case on BRS Working President KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కేసు బనాయించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బల్మూరి వెంకట్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. […]
Gaddar Film Awards 2025: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం నేడు(శనివారం) హైటెక్స్‌లో వైభవంగా జరగనుంది. కొన్నేళ్లుగా సర్కారు నుంచి తెలుగు సినిమా అవార్డుల కార్యక్రమం జరగలేదు. దీంతో కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు, 2024 ఏడాదికి అన్ని విభాగాలకు గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో […]
Mahesh Goud: డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో.. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కాపాడుతూ పార్టీలో, ప్రభుత్వంలో పదవుల పంపిణీ చేస్తుందన్నారు ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను తెలంగాణలో పెద్ద ఎత్తున నిర్వహించినట్టు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఏఐసీసీ అగ్రనేతలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం […]
CM Revanth Reddy Review On Education Department : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాని చెప్పారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 […]
ACB notices to BRS working president KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 16న ఉదయం 10:00 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఒకసారి ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను విచారించారు. […]
Telangana Weather: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు వర్షాలతో ఉపశమనం లభించింది. కాగా నిన్న కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 8.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 8.38, యాదాద్రి భువనగిరి 6.55, హైదరాబాద్ లోని ముషీరాబాద్ […]
New Scheme for Anganwadi Children in Telangana: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాల్లో విద్య అభ్యసిస్తున్న పిల్లలకు కోసం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఐదేండ్లలోపు చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం బాల భరోసా ఆరోగ్యానికి ‘ఆరంభం’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ పథకంతో పిల్లలకు ఫ్రీ ట్రీట్ మెంట్,టెస్టులు, అవసరమైతే శస్త్ర చికిత్సలు అందించనున్నారు. […]
IAS Officers : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను సర్కారు బదిలీ చేసింది. గురువారం సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 33 మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కలెక్టర్‌గా దాసరి హరిచందన, రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ ఎండీగా జె.శంకరయ్య, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా శశాంక్ గోయెల్, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా […]
Six people died due to lightning strike : ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం ఆరుగురు అన్నదాతలను పొట్టనబెట్టుకుంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో విత్తనాలు వేసేందుకు సిద్ధమైన రైతన్నల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఏజెన్సీలోని గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో 14 మంది రైతులు వ్యవసాయ కూలీలతో కలిసి మొక్కజొన్న విత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం నుంచి రక్షణ కోసం పొలంలో ఉన్న కర్రలతో […]