MLA Vakiti Srihari: ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే.. తృటిలో తప్పిన ప్రమాదం
Makthal MLA Vakiti Srihari Road Accident: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రమాదానికి గురయ్యారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటన షాద్‌నగర్ ప్రాంతంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, టీజీ 38 6669 కారును వెనుక నుంచి ఐ20 కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.