Published On:

jurala Project : జూరాలకు ఎగువ నుంచి భారీగా వరద.. 10 గేట్లు ఎత్తివేత

jurala Project : జూరాలకు ఎగువ నుంచి భారీగా వరద.. 10 గేట్లు ఎత్తివేత

Lifting of the ten gates of Jurala : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 18 ఏళ్లలోనే మే నెలలో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి.

 

మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రల్లో కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలల్లోకి ఇవాళ ఉదయం 6,900 క్యూసెక్కుల వరకు ఉన్న వరద.. మధ్యాహ్నానికి 80వేల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ప్రాజెక్టులో నీటినిల్వ 7.682 టీఎంసీలకు చేరింది. సాయంత్రం 6 గంటలకు వరద 66 వేల క్యూసెక్కులకు వరద పెరగటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

 

మహారాష్ట్రలోని ఉజని డ్యామ్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి వరద పోటెత్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గురువారం రాత్రి వరకు జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద లక్ష క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ జుబేర్ ఆహ్మాద్ తెలిపారు.

ఇవి కూడా చదవండి: