Last Updated:

Redmi 14C 5G: రెడ్‌మి అరాచకం.. అబ్బురపరిచే ఫీచర్లతో కొత్త ఫోన్.. హిట్ పక్కా..!

Redmi 14C 5G: రెడ్‌మి అరాచకం.. అబ్బురపరిచే ఫీచర్లతో కొత్త ఫోన్.. హిట్ పక్కా..!

Redmi 14C 5G:  షియోమి సబ్-బ్రాండ్ రెడ్‌మి భారతదేశంలో ఈరోజు జనవరి 6న కొత్త ఎంట్రీ-లెవల్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ‘Redmi 14C 5G’ పేరుతో వస్తున్న ఫోన్ 2023లో లాంచ్ అయిన Redmi 13Cకి సక్సెసర్. కంపెనీ అనేక అప్‌గ్రేడ్‌లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తోంది. అమెజాన్, కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫోన్ స్పెసిఫికేషన్లను వెల్లడించింది. కంపెనీ అనేక ఫీచర్లను కూడా లీక్ చేసింది. మీరు కూడా ఈ ఫోన్ కొనాలనుకొంటే ఫీన్ ఫీచర్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

అమెజాన్‌లో లైవ్ చేసిన మైక్రోసైట్ ఫోన్ మునుపటి ఫోన్లతో పోలిస్తే డిజైన్ పరంగా భిన్నంగా ఉందని చూపిస్తుంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్న వెనుక ప్యానెల్‌లో సర్క్యులర్ ఐస్‌లాండ్ కలిగి ఉంది. వాటర్, డస్ట్ నుండి సురక్షితంగా ఉంచడానికి ఫోన్ IP52 రేటింగ్‌తో వస్తుంది. ఇది స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్‌గేజ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో విడుదల కానుంది. బ్లూ కలర్ వేరియంట్ పైభాగంలో సిల్వర్ కలర్ ఉంటుంది. ఇది ఓంబ్రే ప్రభావాన్ని సృష్టిస్తుంది.

ఫోన్ డిస్‌ప్లే విషయానికి వస్తే దీనిలో 6.88-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ సెగ్మెంట్‌లో ఇదే అతిపెద్ద డిస్‌ప్లే అని కంపెనీ పేర్కొంది. కళ్లకు డిస్‌ప్లేను మెరుగ్గా చేయడానికి, TUV లో బ్లూ లైట్, TUV ఫ్లికర్-ఫ్రీ, TUV సర్టిఫికేట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇది పర్ఫామెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫోన్ హైపర్‌ఓఎస్‌తో నడుస్తుందని కంపెనీ ధృవీకరించింది. పవర్ కోసం ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,160mAh బ్యాటరీతో అందించారు. ఫోటోగ్రఫీ కోసం, ఇది వెనుక ప్యానెల్‌లో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది.

కంపెనీ దాని ధరలకు సంబంధించి ఎలాంటి వివరాలను పంచుకోలేదు. అయితే, నివేదికలు దాని ధరల గురించి ఊహాగానాలు చేశాయి. దీని 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను భారతీయ మార్కెట్లో రూ.13,999కి అందించవచ్చు. ఆఫర్ల తర్వాత ఈ ధర మరింత తగ్గుతుందని చెబుతున్నారు.