Last Updated:

Realme GT 7 Pro: గేమింగ్ ప్రియులకు పండగే.. రియల్‌మి నుంచి ప్రీమియం ఫోన్.. సరికొత్త ప్రాసెసర్‌తో వస్తుంది!

Realme GT 7 Pro: గేమింగ్ ప్రియులకు పండగే.. రియల్‌మి నుంచి ప్రీమియం ఫోన్.. సరికొత్త ప్రాసెసర్‌తో వస్తుంది!

Realme GT 7 Pro: టెక్ కంపెనీ రియల్‌మి మార్కెట్‌లో తన హవా కొనసాగిస్తుంది. వరుస లాంచ్‌లతో దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా  GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇదే ప్రాసెసర్ వన్‌ప్లస్ 13, ఐక్యూ 13లో ఉంటుంది. ఈ రెండు ఫోన్‌లు ఈ ఏడాది చైనాలో విడుదల కానున్నాయి. GT 7 ప్రో ఈ అక్టోబర్‌లో చైనాలో లాంచ్ కానుండగా, నవంబర్ నాటికి ఫోన్ భారతదేశంలోకి వస్తుంది. దాని హై-ఎండ్ స్పెక్స్‌తో GT 7 ప్రో ప్రీమియం లైనప్‌‌లో ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Realme GT 7 Pro Specifications
రియల్‌మి GT 7 ప్రో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా రాబోతోంది. లీక్‌ల ప్రకారం ఫోన్ పెద్ద 6.78 అంగుళాల 1.5K క్వాడ్ మైక్రో కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది వినియోగదారులకు లీనమయ్యే వ్యూ అనుభవాన్ని అందిస్తుంది. ఈ డిస్‌ప్లే సైజు, క్వాలిటీ రియల్‌మి ప్రీమియం మల్టీమీడియా ఫీర్లను ఆఫర్ చేస్తోంది.

రియల్‌మి GT 7 ప్రోలో Qualcomm Snapdragon 8 Gen 4 లేదా Elite చిప్‌సెట్ ఉండచ్చు. ఇది ఈ కొత్త ప్రాసెసర్‌‌తో వస్తున్న మొదటి ఫోన్‌లలో ఒకటిగా మారుతుంది. వినియోగదారులు దీనిలో గరిష్టంగా 16GB RAM + 1TB ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతారు. ఇది రిసోర్స్-ఇంటెన్సివ్ అప్లికేషన్‌లను నిర్వహించడానికి, మరింత డేటాను నిల్వ చేయడానికి ఉత్తమమైనది.

ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా గురించి మాట్లాడితే GT 7 ప్రో పవర్‌ ఫుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో 50MP సోనీ IMX906 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, మరొక 50MP IMX882 సెన్సార్ ఉన్నాయి. ఇది గొప్ప ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. అదనంగా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)తో కూడిన 50MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్‌లను మెరుగుపరుస్తుంది.

బ్యాటరీ పరంగా కూడా ఫోన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 6,500mAh బ్యాటరీ, 120W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌ ఇస్తుంది. ఇది వినియోగదారులకు మరింత బ్యాటరీ లైఫ్,  ఫాస్ట్ ఛార్జింగ్‌ని అందిస్తుంది. ఈ లీక్‌లు నిజమైతే Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయగలదు. ఎక్కడో ఈ ఫోన్ OnePlus 13కి పెద్ద తలనొప్పిగా మారవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే మీరు ఇందులో దాదాపు ఇలాంటి ఫీచర్లనే చూస్తారు.