Last Updated:

Oppo F29 Pro 5G: మిత్రమా రెడీగా ఉండండి.. ఒప్పో 5జీపై భారీ డిస్కౌంట్.. ఊహించిన ఆఫర్లు, డిస్కౌంట్లు..!

Oppo F29 Pro 5G: మిత్రమా రెడీగా ఉండండి.. ఒప్పో 5జీపై భారీ డిస్కౌంట్.. ఊహించిన ఆఫర్లు, డిస్కౌంట్లు..!

Oppo F29 Pro 5G: ఒప్పో ఇటీవల భారతదేశంలో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఇది OPPO F29 సిరీస్ కింద మార్కెట్లోకి ప్రవేశించింది. అవును, ఎంతగానో ఎదురుచూస్తున్న OPPO F29 Pro 5G స్మార్ట్‌ఫోన్ అధికారికంగా దేశీయ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ ఇప్పుడు కొనుగోలు కోసం అందుబాటులో ఉంది. రూ.30,000 బడ్జెట్‌లో కొనుగోలు చేయచ్చు. ఈ కొత్త ఫోన్ ధర, ఆఫర్‌లు, స్పెసిఫికేషన్‌లను వివరంగా తెలుసుకుందాం.

Oppo F29 Pro 5G Offers
Oppo F29 Pro 5G ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.27,999. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కూడా రూ. 31,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ 10శాతం తక్షణ బ్యాంక్ తగ్గింపును అందిస్తోంది.

ఈ ఆఫర్ SBI కార్డ్‌లు, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అందుబాటులో ఉంది. దీనితో పాటుగా అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ. 2,500 అందిస్తున్నారు. మీరు 6 నెలల వరకు నో కాస్ట్ EMI, 8 నెలల వరకు కన్స్యూమర్ లోన్ ప్రయోజనాన్ని పొందచ్చు. మీరు ఈ ఫోన్‌ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయచ్చు.

Oppo F29 Pro 5G Featuures
Oppo F29 Pro 5G మొబైల్‌లో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 2412 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ Android 15 ఆధారంగా కలర్ OS 15తో రన్ అవుతుంది. గ్రాఫిక్స్ కోసం Mali G615 MC2 GPUని కూడా ఉంది. ఈ ఫోన్‌లో 8GB, 12GB RAM, 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి.

Oppo F29 Pro 5G ఫోన్‌లో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. 2-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఈ మొబైల్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో LED ఫ్లాష్ , వివిధ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఈ Oppo 5G స్మార్ట్‌ఫోన్‌లో 6,000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు.