Published On:

OnePlus 13R Price Drop: ధర భారీగా పడిపోయింది.. వన్‌ప్లస్ 13ఆర్‌పై ఊహించని డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ చేయకండి..!

OnePlus 13R Price Drop: ధర భారీగా పడిపోయింది.. వన్‌ప్లస్ 13ఆర్‌పై ఊహించని డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ చేయకండి..!

OnePlus 13R Price Drop: దేశీయ మార్కెట్లో వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లకు చాలా మంచి డిమాండ్ ఉంది. మొబైల్ ప్రియులు ఎక్కువగా ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కంపెనీ తమ వినియోగదారులకు చేరువయ్యేందుకు ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ ఫీచర్లు, సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అలానే భారీ, ఆఫర్లు డిస్కౌంట్లు ప్రకటిస్తూ సేల్స్‌ను పెంచుకుంటుంది. ఇప్పుడు కంపెనీ తాజాగా OnePlus13R బంపర్ ఆఫర్ ప్రకటించింది.

 

వన్‌ప్లస్ ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను రూ. 12 వేల వరకు తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ, 16జీబీ ర్యామ్ వంటి అనేక శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా, కంపెనీ త్వరలో OnePlus 13Tని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని వన్‌ప్లస్ నిర్ధారించింది. వన్‌ప్లస్ 13ఆర్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు, దాని ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

 

OnePlus 13R Offers
OnePlus 13R రెండు స్టోరేజ్ వేరియంట్లలో విడుదలైంది – 12GB RAM + 256GB,1 6GB RAM + 512GB. దీని బేస్ వేరియంట్ రూ.44,999 ధరకు లభిస్తుంది. అదే సమయంలో దీని టాప్ వేరియంట్ రూ. 51,999కు లభిస్తుంది. ఈ ఫోన్ కొనుగోలుపై, రూ. 3,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్, రూ. 4,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌ను అమెజాన్ సేల్‌లో రూ.39,999 ప్రారంభ ధరకు అందుబాటులోకి తెస్తోంది. దీని ధర రూ. 51,999 కానీ ఈ ఫోన్ సేల్‌లో రూ. 12,000 తక్కువ ధరకు లభిస్తుంది.

 

OnePlus 13R Features And Specifications
ఈ ఫోన్‌లో 6.82 అంగుళాల 1.5K ప్రో XDR డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో అమోలెడ్ స్క్రీన్ ఉపయోగించారు. దీని గరిష్ట ప్రకాశం 4,500 నిట్‌ల వరకు ఉంటుంది .ఇది 120Hz హై రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది.

 

ఈ ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8జెన్ 3 ప్రాసెసర్ ఉంది, దీనితో 16జీబీ ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్ OS పై పనిచేస్తుంది. ఇది శక్తివంతమైన 6,000mAh బ్యాటరీతో పాటు 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

 

ఈ OnePlus ఫోన్‌లో ప్రో గ్రేడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో 50MP మెయిన్ OIS కెమెరా ఉంది. దీనితో పాటు 50MP టెలిఫోటో,8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. టెలిఫోటో కెమెరా 2x ఆప్టికల్, 4x లాస్‌లెస్ జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16MP కెమెరా ఉంది.