Published On:

Motorola Edge 60 Fusion: అదిరే ఫీచర్లు.. అందరు సిద్ధంగా ఉండండి.. మోటో కొత్త ఫోన్ వచ్చేస్తోంది..!

Motorola Edge 60 Fusion: అదిరే ఫీచర్లు.. అందరు సిద్ధంగా ఉండండి.. మోటో కొత్త ఫోన్ వచ్చేస్తోంది..!

Motorola Edge 60 Fusion: మోటరోలా మరోసారి భారత మార్కెట్లోకి ప్రవేశించింది. గత రెండేళ్లలో మోటరోలా బడ్జెట్ నుండి ప్రీమియం సెగ్మెంట్ వరకు అనేక స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. 2025లో కూడా కంపెనీ తన మిలియన్ల కొద్దీ అభిమానులకు ఎన్నో పెద్ద సర్ప్రైజ్‌లను అందించబోతోంది. మీరు కొత్త మోటరోలా ఫోన్‌ని కొనాలని చూస్తుంటే మీకో శుభవార్త ఉంది. మోటరోలా ప్రీమియం సెగ్మెంట్‌లో నాక్ చేసే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో పరిచయం చేయబోతోంది. Motorola Edge 60 Fusion పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వస్తుంది.

మీకు తక్కువ ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కావాలంటే ఇది ఉత్తమ ఎంపిక. Motorola Edge 60 Fusion లాంచ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 2న భారతీయ మార్కెట్లోకి రానుంది. Motorola Moto Edge 50 Fusion సక్సెసర్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను వస్తుంది. లాంచ్‌కు ముందే ఈ స్మార్ట్‌ఫోన్ అనేక లీక్‌లు బయటకు వచ్చాయి, ఇందులో దాని సాధ్యమైన ధర, ఫీచర్లు వెల్లడయ్యాయి. Motorola Edge 60 Fusionలో శక్తివంతమైన ఫీచర్లు ఉండనున్నాయి. ఇది మల్టీ-టాస్కింగ్, గేమింగ్ వంటి భారీ పనులలో అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

ప్రస్తుతం Motorola Edge 60 Fusion ధరకు సంబంధించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, అయితే లీక్‌లను విశ్వసిస్తే, దీనిని ఈ మార్కెట్‌లో రూ.25 వేల బడ్జెట్‌లో విడుదల చేయచ్చు. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్‌ను అందించగలదు. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ను కంపెనీ భారతీయ మార్కెట్లో రూ. 22,999 ధరకు పరిచయం చేసింది.

Motorola Edge 60 Fusion Features
మోటో అభిమానులకు మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌లో 6.7 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉండబోతుంది. స్క్రోలింగ్ చేసేటప్పుడు ఫోన్ లాగ్ అవ్వకుండా చూసుకోవడానికి, 120Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వచ్చు. నీరు, ధూళి నుండి సురక్షితంగా ఉంచడానికి, కంపెనీ ఈ ఫోన్‌కు IP68 రేటింగ్ ఇవ్వగలదు. ఇది కాకుండా, కస్టమర్లకు వేగన్ లెదర్ బ్యాక్ ఫినిషింగ్ డిజైన్‌ను కూడా అందించవచ్చు.

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ పనితీరు గురించి చెప్పాలంటే.. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఇందులో చూడచ్చు. ఈ చిప్‌సెట్ TSMC 4nm టెక్నాలజీపై తయారుచేశారు. ఫోటోగ్రఫీ కోసం, ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. దీనిలో ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్‌లు ఉండచ్చు. ఇది సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరాతో అందించనుంది.