Published On:

Amazon Mobile Offers: చవక.. చవక.. అంతా చవక.. ఈ రెండు ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. వెరీ చీప్ ధరకే..!

Amazon Mobile Offers: చవక.. చవక.. అంతా చవక.. ఈ రెండు ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. వెరీ చీప్ ధరకే..!

Amazon Mobile Offers: మొబైల్ ప్రియులకు ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ అద్భుతమైన డీల్స్ తీసుకొచ్చింది. ఇందులో వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లోని రెండు ఫేమస్ స్మార్ట్‌ఫోన్స్ Nord 4 5G, Nord CE 4 లపై భారీ ఆఫర్లు తీసుకొచ్చింది. ఈ రెండింటిపై రూ.4500 వరకు తగ్గింపు ఇస్తున్నారు. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను క్యాష్‌బ్యాక్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌తో ఈ ఫోన్‌లు మీ సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే అదనపు తగ్గింపు మీ పాత ఫోన్ పరిస్థితి, దాని బ్రాండ్ , కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.

 

OnePlus Nord 4 5G
8GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ వేరియంట్ ధర అమెజాన్ ఇండియాలో రూ.29,498. బ్యాంక్ ఆఫర్ కింద జూన్ 30 వరకు మీరు ఈ ఫోన్‌ను రూ.4500 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై కంపెనీ రూ.884 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది.

 

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు రూ. 28 వేల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లేను పొందుతారు. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. ఈ ఫోన్ బ్యాటరీ 5500mAh. ఈ బ్యాటరీ 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సహాయంతో, ఫోన్ 28 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ అవుతుంది.

 

OnePlus Nord CE4
8GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఫోన్ వేరియంట్ ధర రూ. 21997. అమెజాన్ డీల్‌లో, మీరు రూ. 2 వేల బ్యాంక్ డిస్కౌంట్‌తో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై కంపెనీ రూ.659 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మీరు ఈ ఫోన్ ధరను మరింత తగ్గించచ్చు.

 

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఉంటుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్‌లో, మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లభిస్తుంది. ప్రాసెసర్‌గా, మీకు ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 అందించారు. ఈ ఫోన్ బ్యాటరీ 5500mAh. ఈ బ్యాటరీ 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి: