Home / Telangana
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మౌన దీక్ష ప్రారంభమైంది. పోడు భూములు, గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చుకున్నారు. నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికపై సీఎం కేసీఆర్ కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు.
కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, అందుకే బీజేపీని, ప్రధాని మోదీని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కు సంస్కారం లేదని, దేశ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడే మాటలేనా అవి ఆయన నిలదీశారు.
బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ప్రదాని మోడీ సభపై విమర్శలు గుప్పించారు. తాను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా మోదీ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. ప్రధాని ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. మోదీ.. అవివేక, అసమర్ధ పాలన సాగిస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు.
మారేడుపల్లి సీఐ నాగేశ్వర్ రావు సస్పెండ్ అయ్యారు. అత్యాచారం, ఆయుధ చట్టం కింద సీఐ నాగేశ్వర్ రావుపై కేసు నమోదయింది. దీనితో నాగేశ్వర్ రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీదు, బోనాల పండుగ బందోబస్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుపల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియమించారు.