Home / Telangana Politics
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలలో కలిపి 10 సీట్లకు గాను తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది.
తెలంగాణ ముద్దుబిడ్డ, సీఎం కేసీఆర్ నేడు 69 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, అభిమానులు కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
దేశ ఆర్థిక పరిస్థితి పై ఏమాత్రం అవగాహన లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. షర్మిలను చూస్తే జాలి వేస్తుందని కడియం వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళ సై కు మధ్య వైరం తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు.
Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనాని ఛలో కొండగట్టు లో భాగంగా జగిత్యాల జిల్లా నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నేతలతో జనసేనాని సమావేశం అయ్యారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణలో పార్టీ స్థితిగతుల గురించి వారితో చర్చించారు. తెలంగాణలోనూ జనసేన పోటీ భవిష్యత్ తరాల కోసం జనసేన తెలంగాణలోనూ పోటీ చేస్తుందని, సామాన్యులకు అండగా ఉంటుందని చెప్పారు. […]
Revanth Reddy: సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్థరాత్రి ఓ డిప్యూటీ తహసీల్దార్ చొరబడటంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy) స్పందించారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు స్మితా సబర్వాల్ సంఘటన అద్దం పడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శికే రక్షణ లేకపోతే.. ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిమమ్ గవర్నెన్స్.. మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ ‘ సీఎం కార్యదర్శి ప్రాణాలకే […]
తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకం ద్వారా ఎంతో మంది లబ్దిపొందారు. కాగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా
సీఎం కే. చంద్రశేఖర్ రావు బీజేపీ, మోదీ ప్రభుత్వంపై ఖమ్మంలోని బీఆర్ఎస్ సభ వేదికగా మరోసారి మండిపడ్డారు. మోదీది ప్రైవేటైజేషన్ పాలసీ అని తమది నేషనైలేజషన్ పాలసీ అని ఆయన పేర్కొన్నారు. 2024 తర్వాత మోదీ ప్రభుత్వం కచ్చితంగా ఇంటికి వెళ్తుందని.. తాము ఢిల్లీకి వెళ్తామంటూ ఆయన పేర్కొన్నారు.
BRS meeting in Khammam: తెలంగాణ సీఎం కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కంటి వెలుగు కార్యక్రమం అద్భుతమని.. ఆ పథకం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ, పంజాజ్ లోనూ ఈ కార్యక్రమం చేపడుతామని ఆయన అన్నారు. తెలంగాణలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలపై కూడా కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. దేశం అభివృద్ధి చెందడం ఎలా.. రైతులకు, కార్మికులకు ఏం చేయాలనే అంశాలపై ముఖ్యనేతలందరం కలిసి […]