Home / Secunderabad
Fire Accident Secunderabad: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేటలో ఈ ప్రమాదం సంభవించింది. డెక్కన్ నైట్ వేర్ కార్ల విడి భాగాల షాప్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా మంటలు దుకాణం అంతటా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తప్పిన భారీ ప్రమాదం.. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నాయి. ఈ ప్రమాదం […]
Vande Bharat Express: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) అందుబాటులోకి రానుంది. ఈ నెల 15న వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ – వైజాగ్ మధ్య వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు ఉంటాయి. ఆదివారం పూర్తిగా సెలవు. సంక్రాంతి రోజున ప్రధానమంత్రి మోదీ వర్చువల్ గా ఈ రైలును ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ […]
భారత రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘వందేభారత్ ఎక్స్ ప్రెస్’ త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెల 19న ఈ రైలు ప్రారంభం కానుంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం నుంచి నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర చేయనున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు పాదయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు 114 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.
భాగ్యనగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట దొంగతనాలు, మర్డర్లు కామన్ గా మారిపోయాయి. మరీ ముఖ్యంగా మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళనలు చెందుతున్నారు. అందుకు తగ్గట్టుగానే సికింద్రాబాద్ లో ఓ ఘటన అద్దం పడుతుంది.
ప్రయాణీకుల రద్ధీతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణించేందుకు రిజర్వేషన్ టిక్కెట్లు దొరకడమే నానా కష్టంగా మారింది. ఈ క్రమంలో భాగ్యనగర ప్రజలకు దక్షిణ రైల్వే తీపి కబురు చెప్పింది. ఈ నెల 12 నుండి 16 వరకు 6 ప్రత్యేక రైళ్లు హైదరాబాదు మీదుగా వెళ్లనున్నట్లు ప్రకటించింది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకొనింది
సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో జరిగిన భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాగా దీనిపై సీఎం కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందించారు.
సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'రూబీ లగ్జరీ ప్రైడ్' 5 అంతస్థుల బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో 'బగాస్ ఈవి ప్రైవేట్ లిమిటెడ్'ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నుంచి ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలి ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ ఉన్న వాహనాలకు కూడా అంటుకున్నాయి.