Home / sajjala ramakrishna reddy
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు. వారి వారి ఆలోచనల మేరకు పాలన ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తిస్తే మేం కూడా పరుషంగా మాట్లాడగలం. సీఎం కేసిఆర్ ను తిడితే మంత్రి హరీష్ కు సంతోషం అనుకొంటే అందుకు మేము రెడీ అని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో పేర్కొన్నారు.
గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలపై విచారణ జరుగుతోందని రిపోర్టులు వచ్చాకే చర్యలుంటాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాధవ్ వేధించినట్లు ఏ మహిళా ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దదన్నారు సజ్జల