Home / latest Telangana news
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనను ప్రధాని నరేంద్ర మోదీకి మిత్రుడంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సభలో ఓవైసీ మాట్లాడుతూ రాహుల్‌కు ప్రాణంగా ప్రేమించే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, ఒకరు ఇటలీ, రెండో వ్యక్తి మోదీ అని అన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నేత కార్మికులను ఆదుకునేందుకు మక్తల్‌లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం మక్తల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను సర్వనాశనం చేసిందని ఆరోపించారు.
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి పాల్పడితే మోదీ అండగా నిలబడ్డారని చెప్పారు. ఆదివారం ఆందోల్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ తగ్గేదేలే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ అగ్ర నేతలను రంగంలోకి దించుతుంది. అందులో భాగంగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బరిలో నిలిచిన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నపధ్యంలో రాష్ట్రంలో ఐటీ శాఖ వరుస దాడులు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తాండూరు అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడినట్లు తెలిసింది. మెుత్తం రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను
తెలంగాణలో నువ్వా - నేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ తగ్గేదేలే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ అగ్ర నేతలను రంగంలోకి దించుతుంది. అందులో భాగంగానే సీఎల్పీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుండి మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..
సంగారెడ్డి రూరల్ పోలీస్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 635 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. అలానే రెండు బొలెరో వాహనాలను సీజ్ చేసి.. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మీడియాకు వివరించారు. దీని విలువ దాదాపు రూ. 3 కోట్ల వరకు ఉండొచ్చని ఆయన చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇవాళ హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించారు. HICC లో రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం రాయదుర్గంనుంచి బేగంపేట వరకు మెట్రోలో ప్రయాణించారు.
మంత్రి కేటీఆర్ వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో కేటీఆర్ వ్యవహార శైలిపై తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పించారు. ఇక్కడ మోదీని గూండా అని తిట్టి ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకుంటారంటూ ఎద్దేవా చేసారు.