Home / Latest News
రియాల్టీ షో ప్రారంభ సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, సీజన్ 2కి హీరో నాని చేసారు.అయితే, అక్కినేని నాగార్జున మూడవ సీజన్లోకి ప్రవేశించి కొనసాగుతున్నారు. అఅతను షో నుండి రెండుసార్లు విరామం తీసుకున్నప్పటికీ, ఒకసారి సమంతకు మరియు తరువాత రమ్యకృష్ణకి హోస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు.
వరదల ధాటికి పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరెంతోమంది నిరాశ్రయులయ్యారు. గత 24 గంటల్లోనే 119 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేత ద్వారా సూపర్‌టెక్ లిమిటెడ్ రియల్టీ కంపెనీకి సుమారు 500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం విషయానికి వస్తే నిర్మాణ వ్యయంతో పాటు బ్యాంకు వడ్డీలు తదితర అంశాలు కలిసి ఉన్నాయయని కంపెనీ చైర్మన్ ఆర్ కె అరోరా అన్నారు.
న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో తమ ఇంటివద్ద బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లైఫ్ సైజ్ విగ్రహాన్ని భారతీయ-అమెరికన్ కుటుంబం ఏర్పాటు చేసింది.ఎడిసన్‌లోని రింకు మరియు గోపీ సేథ్‌ల ఇంటి వెలుపల భారీ ఎత్తున ప్రజలు గుమికూడి పటాసులు కాల్చారు. గోపీ సేథ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు వేణుగోపాల్, మధుసూదన్ మిస్త్రీ, జై రాం రమేశ్ వెల్లడించారు.వర్చువల్‌గా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను తెలిపారు. సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
ఏపీ వ్యాప్తంగా రెండురోజులు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
నోయిడా లోని ట్విన్ టవర్స్ అందరూ ఊహించినట్టే భవనాన్ని కూల్చి వేశారు . 9 సెకన్లలోనే వ్యవధి లోనే పూర్తిగా కుప్ప కూల్చారు . దీనికోసం రెండు రోజుల నుంచి పనులను చేస్తూనే ఉన్నారు . ఆదివారం అనుకున్న సమయానికే భవనాలను కూల్చివేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 35 కోట్లతో ఒక అపార్టుమెంటును కొన్నట్లు తెలిసిన సమాచారం. విజయ్ కు చెన్నై లో అతి పెద్ద ఇల్లు ఉంది . ఇప్పుడు కొన్న కూడా చెన్నై అని తెలిసిన సమాచారం . విజయ్ ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రోడ్డులో తన కుటుంభంతో అక్కడే ఉంటున్నారు .
విశాఖ బీచ్‌లో గల్లంతై.. నెల్లూరులో ప్రత్యక్షమైన సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు గాను, కోర్టు అనుమతితో కేసు నమోదు చేశారు.
కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విట్టర్లో వందేభారత్-2 స్పీడ్ ట్రయల్ కోట-నాగ్డా సెక్షన్ మధ్య 120/130/150 మరియు 180 కి.మీగా ఉందని రాసారు.