Home / latest international news
ఆస్ట్రేలియాలోని మెనిండీలో మిలియన్ల కొద్దీ చనిపోయిన మరియు కుళ్ళిన చేపలు తీరానికి కొట్టుకు వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.న్యూ సౌత్ వేల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్ ప్రకారం, వరదనీరు తగ్గుముఖం పట్టినప్పుడు ప్రాణవాయువు తక్కువగా ఉండటం వల్ల మరణాలు సంభవించి ఉండవచ్చు.
ఖలిస్తానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ ఇప్పటికీ పంజాబ్ పోలీసుల నుండి పరారీలో ఉన్నాడని మరియు అతని జాడ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత సాయంత్రం జలంధర్‌లో మోటార్‌సైకిల్‌పై వేగంగా వెళ్తున్న అమృతపాల్ సింగ్‌ను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించినట్లు వర్గాలు చెబుతున్నాయి
బంగ్లాదేశ్‌లోని మదారిపూర్‌లోని షిబ్‌చార్ ఉపజిల్లాలోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో ఢాకాకు వెళ్తున్న బస్సు పద్మ వంతెన వద్దకు వెళ్లే రహదారిపై నుండి ఒక కాలువలోకి దూసుకెళ్లడంతో కనీసం 17మంది మరణించగా 30 మంది గాయపడ్డారు.
శనివారం దక్షిణ ఈక్వెడార్ మరియు ఉత్తర పెరూలో సంభవించిన బలమైన భూకంపంతో 15 మంది మృతి చెందగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ఈక్వెడార్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన గ్వాయాక్విల్కు దక్షిణంగా 50 మైళ్ల (80 కిలోమీటర్లు) దూరంలో పసిఫిక్ తీరంలో కేంద్రీకృతమై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నివేదించింది.
ఈ క్రమంలోనే ‘ఐయామ్ బ్యాక్’ అంటూ ఫేస్బుక్, యూట్యూబ్‌లో శుక్రవారం ట్రంప్ పోస్ట్ చేశారు.
:నగదు కొరతతో ఉన్న పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఎంఎఫ్) నుండి బెయిలౌట్ పొందడానికి కష్టపడుతో్ంది. ఈ నేపధ్యంలో ఐఎంఎఫ్ ముందుకు తెచ్చిన కొత్త షరతులు పాకిస్తాన్‌కు రుణ ఒప్పందాన్ని పొందడం మరింత కష్టతరం చేసే అవకాశం ఉంది.
వీడియో షేరింగ్ చైనీస్ యాప్ టిక్ టాక్ ని నిషేధించిన దేశాల జాబితాలో న్యూజిలాండ్ చేరింది. మార్చి చివరి నాటికి నెట్‌వర్క్‌కు యాక్సెస్ ఉన్న అన్ని పరికరాల్లో యాప్ నిషేధించబడుతుంది.
ఇజ్రాయెల్‌లోని ఒక జంట తమ కుమార్తె తప్పుగా అమర్చిన పిండం నుండి జన్మించిన తర్వాత ఫెర్టిలిటీ క్లినిక్‌పై రూ.226 కోట్లకు దావా వేస్తున్నారు. వీరు రిషాన్ నగరంలోని అసుతా మెడికల్ సెంటర్‌పై దావా వేయాలని నిర్ణయించుకున్నారు.
చైనాలో యాంటీవైరల్ ఫ్లూ ఔషధాల ఆన్లైన్ అమ్మకాలు ఏడాది క్రితం కంటే 100 రెట్లు పెరిగాయి. చైనా ఆధారిత ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు టావోబావోలో మార్చి మొదటి 13 రోజుల్లో ఒసెల్టామివిర్ అనే జెనెరిక్ పేరుతో విక్రయించబడుతున్న ఈ ఔషధం అమ్మకాల పరిమాణం దాదాపు 533,100 యూనిట్లకు పెరిగిందని నివేదిక పేర్కొంది.
:ఫ్రెడ్డీ తుఫాను కారణంగా మొజాంబిక్ మరియు మలావిలో సంభవించిన వరదలకు 300 మంది మరణించగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. తుఫాను కారణంగా దేశంలోని ఆర్థిక కేంద్రమైన బ్లాంటైర్‌తో సహా మలావి యొక్క దక్షిణ ప్రాంతంలో కనీసం 300 మంది మరణించగా మరో 88,000 మంది నిరాశ్రయులయ్యారు.